World Cup : కామెంటేటర్స్ లిస్ట్ ప్రకటించిన ఐసీసీ.. ఈ గొంతులతో మ్యాచ్‌లు ఆస్వాదించండి..!
ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 భారతదేశంలో జరుగుతుంది. టోర్నీ ప్రారంభం కావడానికి మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు ఇప్పటికే తమ ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. అభిమానులంతా కూడా తమ అభిమాన ఆటగాళ్లను మైదానంలో చూడాలని తహతహలాడుతున్నారు.

Full list of commentators and broadcasters announced for CWC
ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్(ICC Mens Cricket World Cup) 2023 భారతదేశం(India)లో జరుగుతుంది. టోర్నీ ప్రారంభం కావడానికి మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. ప్రపంచకప్(World Cup)లో పాల్గొనే జట్లు ఇప్పటికే తమ ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. అభిమానులంతా కూడా తమ అభిమాన ఆటగాళ్లను మైదానంలో చూడాలని తహతహలాడుతున్నారు. అదే సమయంలో.. కొంతమంది వ్యాఖ్యాతల స్వరాలకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆటతో పాటు కామెంట్రిని ఎంజాయ్ చేసే ప్రేక్షకులు కూడా చాలా మందే ఉన్నారు. దీంతో వ్యాఖ్యాతల లిస్ట్ కూడా ఫైనల్ చేసింది ఐసీసీ. ప్రపంచ కప్ ఈవెంట్ కవరేజీలో ప్రీ-మ్యాచ్ షో, ఇన్నింగ్స్ ఇంటర్వెల్ ప్రోగ్రామ్, పోస్ట్-మ్యాచ్ ర్యాప్-అప్ ఉంటాయి. వీటిలో వ్యాఖ్యతలుగా వ్యవహరించే వారి లిస్ట్‌ను ఐసీసీ ప్రకటించింది.
ప్రపంచ కప్ కోసం ప్రకటించిన వ్యాఖ్యాతలు(Commentators), బ్రాడ్‌కాస్టర్స్(broadcasters) పూర్తి జాబితా
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్ మరియు ఐర్లాండ్), షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా), లీసా స్తాలేకర్ (ఆస్ట్రేలియా), రమీజ్ రాజా (పాకిస్థాన్), రవిశాస్త్రి (భారత్), ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), సునీల్ గవాస్కర్ (భారత్), మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), ఇయాన్ స్మిత్ (న్యూజిలాండ్), నాజర్ హుస్సేన్ (ఇంగ్లండ్), ఇయాన్ బిషప్ (ట్రినిడాడ్ - వెస్టిండీస్)
వకార్ యూనిస్ (పాకిస్థాన్), షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా), అంజుమ్ చోప్రా (భారత్), మైఖేల్ అథర్టన్ (ఇంగ్లండ్), సైమన్ డౌల్ (న్యూజిలాండ్), మ్పుమెలెలో మొబంగ్వా (జింబాబ్వే), సంజయ్ మంజ్రేకర్ (భారత్), కేటీ మార్టిన్ (న్యూజిలాండ్) , దినేష్ కార్తీక్ (భారతదేశం), డిర్క్ నాన్స్ (ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్), శామ్యూల్ బద్రీ (ట్రినిడాడ్ - వెస్టిండీస్), అథర్ అలీ ఖాన్ (బంగ్లాదేశ్), రస్సెల్ ఆర్నాల్డ్ (శ్రీలంక)
బ్రాడ్‌కాస్టర్స్..
హర్ష భోగ్లే (భారతదేశం), కాస్ నైడూ (దక్షిణాఫ్రికా), మార్క్ నికోలస్ (ఇంగ్లండ్), నటాలీ జెర్మనోస్ (ఆస్ట్రేలియా), మార్క్ హోవార్డ్ (ఆస్ట్రేలియా), ఇయాన్ వార్డ్ (ఇంగ్లండ్)
స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాతల జాబితా(Star Sports Commentators list)
తమిళం(Tamil)
S. బద్రీనాథ్, మురళీ విజయ్, యోమహేష్, విజయకుమార్, రస్సెల్ ఆర్నాల్డ్, హేమంగ్ బదానీ, S రమేష్, నటుడు RJ బాలాజీ
తెలుగు(Telugu)
వేణుగోపాలరావు, టి సుమన్, ఆశిష్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణ
కన్నడ(Kannada)
వినయ్ కుమార్, గుండప్ప విశ్వనాథ్, విజయ్ భరద్వాజ్, భరత్ చిప్లి, పవన్ దేశ్ పాండే, అఖిల్
బాలచంద్ర
