Steven Finn : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్
ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ గాయం సమస్యలతో పోరాడి "ఓటమి"ని అంగీకరించి సోమవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫిన్ 2010-2016 మధ్య ఇంగ్లండ్ తరపున 36 టెస్ట్ మ్యాచ్‌లలో 30.4 సగటుతో 125 వికెట్లు తీశాడు.
ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్(Steven Finn) గాయం సమస్యలతో పోరాడి "ఓటమి"ని అంగీకరించి సోమవారం రిటైర్మెంట్(Retirement) ప్రకటించాడు. ఫిన్ 2010-2016 మధ్య ఇంగ్లండ్ తరపున 36 టెస్ట్(Tests) మ్యాచ్‌లలో 30.4 సగటుతో 125 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల ఫిన్ ఇంగ్లండ్ తరపున 69 వన్డేలు(One Days), 21 ట్వంటీ 20(T20) అంతర్జాతీయ మ్యాచ్(International Matches)లు కూడా ఆడాడు.
వివిధ గాయాలతో ఇబ్బంది పడిన ఫిన్ ఇంగ్లాండ్ జట్టు నుండి తప్పుకున్నాడు. జూలై 2022 నుండి రెడ్-బాల్ క్రికెట్ ఆడలేదు. "నేను గత 12 నెలలుగా నా శరీరంతో పోరాడుతున్నాను మరియు.. ఓటమిని అంగీకరించాను" అని ఫిన్ చెప్పాడు.
ఫిన్ 16 సంవత్సరాల వయస్సులో మిడిల్‌సెక్స్‌తో తన కౌంటీ అరంగేట్రం చేసాడు, 2010లో బంగ్లాదేశ్‌తో జరిగిన తన తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్‌కు వర్ధమాన స్టార్‌గా ఎదిగాడు. మూడు యాషెస్ విజయాలను సాధించడంలో ఇంగ్లండ్‌కు ప్రధాన బౌలర్‌గా వ్యవహరించాడు. ఫిన్ గత సంవత్సరం సస్సెక్స్ కు ఆడేందుకు సంతకం చేసాడు. కానీ దీర్ఘకాల మోకాలి సమస్య నుండి కోలుకోలేక రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాని తెలిపాడు. క్రికెట్ నాకు చాలా ఇచ్చింది.. భవిష్యత్తులో కొంత సామర్థ్యంతో ఆటకు తిరిగి ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా శరీరం మరొక రోజు క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు సహకరిస్తుందా అని ఆలోచించకుండా చూస్తూ ఆనందిస్తానన్నాడు.