Indonesia Footballer : గ్రౌండ్‌లో పెను విషాదం.. పిడుగుపాటుకు ఫుట్‌బాలర్ మృతి
క్రీడా మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఫుట్‌బాల్(Football) ఆట రసవత్తరంగా సాగుతోన్న సమయంలో గ్రౌండ్‌లో పిడుగు పడింది. ఆ పిడుగుపాటుకు ఓ ఫుట్‌బాలర్ ప్రాణాలు కోల్పోయాడు. హృదయ విదారకమైన ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది.

Indonesia Footballer
క్రీడా మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఫుట్‌బాల్(Football) ఆట రసవత్తరంగా సాగుతోన్న సమయంలో గ్రౌండ్‌లో పిడుగు పడింది. ఆ పిడుగుపాటుకు ఓ ఫుట్‌బాలర్ ప్రాణాలు కోల్పోయాడు. హృదయ విదారకమైన ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది. అప్పటి వరకు మైదానంలో అటు ఇటు పరుగెత్తిన ఆటగాడు రెప్పపాటు కాలంలో కన్నుమూయడం చూసి సహచర ఆటగాళ్లు, ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ఘోర ప్రమదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎఫ్‌బీఐ సబంగ్(FBI Sabung), బాండుంగ్ ఫుట్‌బాల్(Bandung FC) క్లబ్ జట్ల మధ్య ఆదివారం ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. రెండు జట్ల ఆటగాళ్లు గోల్స్ కోసం చురుకుగా మైదానంలో తిరుగుతున్నారు. సడన్‌గా సబంగ్ ఆటగాడిపై పిడుగు పడింది. వెంటనే స్టేడియంలోని సిబ్బంది అతడిని సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆ ఫుట్‌బాలర్ ప్రాణాలు విడిచినట్టు డాక్టర్లు తెలిపారు.
