బెంగుళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో RCB ఈ సీజన్‌లో తమ చివరి మ్యాచ్ ఆడగా.. ప్రేక్షకులను పెర్రీ తన బ్యాటింగ్ తో అలరించింది

విమెన్స్ ఐపీఎల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ఉన్న సంగతి తెలిసిందే. గత రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మంచి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ కొట్టిన సిక్సర్ కు ఏకంగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎల్లీస్ పెర్రీ సోమవారం నాడు UP వారియర్స్ తో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2024 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తరపున తన విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ను చూపించింది.

బెంగుళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో RCB ఈ సీజన్‌లో తమ చివరి మ్యాచ్ ఆడగా.. ప్రేక్షకులను పెర్రీ తన బ్యాటింగ్ తో అలరించింది. ఆమె షాట్‌లలో ఒకటి అక్కడ పెట్టిన కారు అద్దాలను పగులగొట్టింది. బౌండరీ లైన్ అవతల అడ్వార్టైజ్మెంట్ కోసం ఉంచే టాటా పంచ్ కారు అద్దం పెర్రీ కొట్టిన భారీ సిక్సర్ ద్వారా పగిలిపోయింది. పెర్రీ ఈ మ్యాచ్ లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. ఆమె 34 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించింది. 37 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 58 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో సోఫీ ఎక్లెస్టోన్ ఆమెను అవుట్ చేసే సమయానికి ఆర్సీబీ మంచి పొజిషన్ లో ఉంది. 19వ ఓవర్లో దీప్తి శర్మ బౌలింగ్ లో భారీ సిక్సర్ కొట్టిన పెర్రీ కారు అద్దాన్ని పగులగొట్టింది. పెర్రీ కూడా కారు అద్దం బద్దలవ్వగానే షాక్ అయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 198 పరుగులు చేయగా.. యూపీ వారియర్స్ 175 పరుగులకు పరిమితమైంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ స్మ్రితి మందాన 80 పరుగులు చేసింది. ఆమెకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Updated On 4 March 2024 9:14 PM GMT
Yagnik

Yagnik

Next Story