ముంబై ఇండియన్స్ జట్టులో తిలక్ వర్మ వివాదం లక్నో సూపర్‌ గెయింట్స్‌(LSG)తో జరిగిన మ్యాచ్‌లో ప్రారంభమైంది.

ముంబై ఇండియన్స్ జట్టులో తిలక్ వర్మ వివాదం లక్నో సూపర్‌ గెయింట్స్‌(LSG)తో జరిగిన మ్యాచ్‌లో ప్రారంభమైంది. తిలక్‌వర్మ(Tilak Varma)ను "రిటైర్డ్ అవుట్" చేసిన సంఘటన చుట్టూ ఈ వివాదం తిరుగుతుంది. ఇది ఏప్రిల్ 4 న జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ముంబై ఇండియన్స్‌(Mumbai indians)204 పరుగుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో జరిగింది. ముంబై ఇండియన్స్‌కి చివరి 7 బంతుల్లో 24 పరుగులు కావాల్సి ఉంది, అప్పుడు తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులతో ఆడుతున్నాడు. అతను బాగా టైమింగ్ చేయలేక స్లోగా ఆడుతున్నాడని భావించిన యాజమాన్యం కోచ్ మహేల జయవర్దనే నిర్ణయంతో అతన్ని రిటైర్డ్ అవుట్ చేసి, మిచెల్ సాంట్నర్‌(Mitchell Santner)ని పంపింది. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ముంబై ఇండియన్స్‌కు ఇంకా 5 వికెట్లు ఉన్నాయి, కానీ చివరికి 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటివారు ఈ నిర్ణయాన్ని విమర్శించారు. తిలక్ వర్మ యువ, టాలెంటెడ్ ఆటగాడు. అతన్ని ఇలా బయటకు పంపడం వల్ల అతని మానసిక ధైర్యం దెబ్బతింటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కోచ్ మహేల జయవర్దనే దీన్ని "టాక్టికల్ కాల్" అని చెప్పాడు, తిలక్ రిథమ్ కోల్పోయాడని, ఫ్రెష్ ఆటగాడితో పెద్ద షాట్స్ ఆడాలని భావించామని వివరించాడు. కానీ సాంట్నర్ కూడా పెద్దగా రాణించలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా దీన్ని "స్పష్టమైన ఎంపిక" అని సమర్థించాడు, కానీ అతని లీడర్‌షిప్ మీద ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఈ ఘటన మరింత వివాదాన్ని రేకెత్తించింది. తిలక్‌కి వేలికి గాయం ఉంది, అందుకే ఇలా చేశారని చెప్పారు. కానీ ఇది అధికారికంగా వెల్లడించలేదు. దీనిపై చాలా మంది ఫ్యాన్స్ Xలో ముంబై ఇండియన్స్ యాజమాన్యాన్ని తప్పుపట్టారు, "తిలక్‌ని అవమానించారు" అని కామెంట్స్ చేశారు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ నిర్ణయంతో అసంతృప్తిగా కనిపించాడని, మహేల సూర్యకుమార్‌ యాదవ్‌ను సముదాయించాడని సమాచారం. మ్యాచ్ తర్వాత, తిలక్ వర్మ ఇన్‌స్టాగ్రామ్ బయో నుంచి "ముంబై ఇండియన్స్" లోగోను తొలగించాడనే పుకార్లు వచ్చాయి. కానీ ఇది నిజం కాదని అతని ఇన్‌స్టా బయోలో ఎప్పుడూ MI లోగో లేదని.. ఇది అసత్యమని తెలిపారు. ఈ రిటైర్డ్ అవుట్ నిర్ణయం MI యాజమాన్యం, హార్దిక్ పాండ్యా నాయకత్వంపై మరింత విమర్శలను తెచ్చిపెట్టింది. తిలక్ వంటి ఆటగాడిని ఇలా బయటకు పంపడం సరైందేనా, లేదా ఇది ఒక ఫెయిల్డ్ ఎక్స్‌పెరిమెంట్‌నా అనేది చర్చనీయాంశంగా మారింది.

Updated On 7 April 2025 10:11 AM GMT
ehatv

ehatv

Next Story