Royal Challengers Bangalore vs Rajasthan Royals : మాక్స్‌వెల్, డుప్లెసిస్ విధ్వంసం.. రాజస్థాన్ రాయల్స్‌పై బెంగళూరు విక్టరీ
ఐపీఎల్ 32వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఏడు పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 189 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా రాజస్థాన్ జట్టు 182 పరుగులకే ఆలౌటైంది. రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 32వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఏడు పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) పై విజయం సాధించింది. బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ(RCB) 189 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా రాజస్థాన్(Rahasthan) జట్టు 182 పరుగులకే ఆలౌటైంది. రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్‌ను రెండోస్థానానికి పడేసింది. అయితే మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా రాజస్థాన్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plessis) 62, మాక్స్‌వెల్(Glenn Maxwell) 77 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(Trent Boult), సందీప్ శర్మ(Sandeep Sharma) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం రాజస్థాన్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. దేవదత్ పడిక్కల్ 52, యశస్వి జైస్వాల్ 47 పరుగులు చేశారు. చివర్లో.. ధృవ్ జురెల్ 16 బంతుల్లో 34 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అతని జట్టును గెలిపించలేకపోయాడు. ఆర్‌సీబీ తరఫున హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టాడు.