ధర్మశాల టెస్టులో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు

ధర్మశాల టెస్టులో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. తొలి రోజు బంతితో అద్భుతం చేసిన భారత జట్టు.. ఆ తర్వాత బ్యాట్ తో రాణించింది. కెప్టెన్ రోహిత్‌శర్మ, యువ ఆటగాడు శుభమన్‌గిల్ ఇద్దరూ శతకాలు బాదారు. రోహిత్ 162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గిల్ 10 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ చేశాడు. లంచ్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 264 పరుగులు చేసి ప్రత్యర్థి కంటే 46 పరుగుల ఆధిక్యం సాధించింది. యశస్వి జైస్వాల్ 57 పరుగులు చేసి అవుటయ్యాడు. లంచ్ తర్వాత బెన్ స్టోక్స్ వేసిన మొదటి బంతికే రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. చాలా కాలం తర్వాత టెస్ట్ మ్యాచ్ లలో బౌలింగ్ వేసిన బెన్ స్టోక్స్ సెంచరీ చేసిన రోహిత్ ను బోల్తా కొట్టించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జాక్ క్రాలీ చేసిన 79 పరుగులే అత్యధికం. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ 5, అశ్విన్ నాలుగు వికెట్లు తీసుకున్నారు.

Updated On 8 March 2024 1:26 AM GMT
Yagnik

Yagnik

Next Story