Devdutt Padikkal : ధర్మశాల టెస్టులో దేవదత్ పడిక్కల్ అరంగేట్రం.. 24 ఏళ్ల రికార్డు బ్రేక్..!
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ (IND vs ENG 5వ టెస్టు) ధర్మశాలలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ (IND vs ENG 5వ టెస్టు) ధర్మశాలలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ప్లేయింగ్-11లో రెండు మార్పులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం కారణంగా ఆకాష్ దీప్‌కు విశ్రాంతినివ్వగా.. శిక్షణ సమయంలో రజత్ పాటిదార్ గాయపడగా.. అతని స్థానంలో దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. దేవదత్ పడిక్కల్ అరంగేట్రంతో భారత జట్టు చరిత్ర సృష్టించింది. భారత క్రికెట్‌లో 24 ఏళ్ల రికార్డు ధ్వంసమైంది.
రోహిత్ శర్మ ఐదవ టెస్టుకు 11 మందిని ప్రకటించి దేవదత్ పడిక్కల్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఉందని చెప్పాడు. దీంతో భారత క్రికెట్‌లో 24 ఏళ్ల రికార్డు కూడా బద్దలైంది. భారత గడ్డపై ఒక సిరీస్‌లో ఐదుగురు భారతీయ ఆటగాళ్లు అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి.
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఐదో భారత ఆటగాడిగా దేవదత్ పడిక్కల్ నిలిచాడు. ఈ సిరీస్‌లో రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్‌దీప్‌లు అరంగేట్రం చేశారు.
2000 సంవత్సరంలో నలుగురు ఆటగాళ్లు ఒకే సిరీస్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేశారు. 2000 సంవత్సరంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో మురళీ కార్తీక్, వసీం జాఫర్, మహ్మద్ కైఫ్, నిఖిల్ చోప్రాలు అరంగేట్రం చేశారు.
ఇదిలావుంటే.. కర్ణాటక తరఫున ఆడుతున్న దేవదత్ పడిక్కల్ భారత్ తరఫున 314వ టెస్టు ఆటగాడిగా నిలిచాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో దేవదత్ భారత్ తరఫున కేవలం 2 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతను కర్ణాటక తరపున 31 ఫస్ట్ క్లాస్, 30 లిస్ట్ A మ్యాచ్‌లు ఆడాడు.