ఇండియన్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌(Shikhar Dhawan), ఆయన భార్య ఆయేషా ముఖర్జీ(Ayesha Mukherjee)లు అధికారికంగా విడిపోయారు. ఢిల్లీ(Delhi)లోని ఫ్యామిలీ కోర్టు(Family Court) దంపతులకు విడాకులు(Divorce) మంజూరు చేసింది. ఈ కేసులో ఆయేషా ముఖర్జీ క్రూర ప్రవర్తన కారణంగానే విడాకులు మంజూరు చేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది.

ఇండియన్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌(Shikhar Dhawan), ఆయన భార్య ఆయేషా ముఖర్జీ(Ayesha Mukherjee)లు అధికారికంగా విడిపోయారు. ఢిల్లీ(Delhi)లోని ఫ్యామిలీ కోర్టు(Family Court) దంపతులకు విడాకులు(Divorce) మంజూరు చేసింది. ఈ కేసులో ఆయేషా ముఖర్జీ క్రూర ప్రవర్తన కారణంగానే విడాకులు మంజూరు చేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది. తామిద్దరం విడిపోతున్నట్టు రెండేళ్ల కిందటే శిఖర్‌ ధావన్‌, ఆయేషా ముఖర్జీలు తెలిపారు. తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్‌ వేశాడు శిఖర్‌ ధావన్‌. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆయేషా ముఖర్జీపై శిఖర్‌ ధావన్‌ చేసిన ఆరోపణలను కోర్టు సమర్థించింది. శిఖర్‌ ఏకైక కుమారుడిని అతడికి కాకుండా చేసి ఆయేషా మానసికంగా వేధించినట్టు కోర్టు గుర్తించింది. మొదట శిఖర్‌తో కలిసి భారత్‌లో ఉండేందుకు ఆయేషా అంగీకరించింది. కానీ తన మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని చూసుకోవడానికి ఆస్ట్రేలియా(Australia)లోనే ఉండిపోయింది. దీంతో ధావన్‌ తన కుమారుడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక ధావన్‌ తన సొంత డబ్బుతో ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన మూడు ఆస్తులపై తనకు యాజమాన్య హక్కులు కల్పించాలని ఆమె ఒత్తిడి చేసినట్లు కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఒక ఆస్తిలో 99 శాతం వాటా, మిగతా రెండు ఆస్తుల్లో సహ యాజమాన్యం కావాలని ఆమె డిమాండ్‌ చేసినట్లు ధావన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ ఆరోపణలను ఆమె వ్యతిరేకించలేదు. అందువల్ల ఇవన్నీ నిజాలేనని న్యాయస్థానం గుర్తించింది. అంతే కాకుండా శిఖర్‌ ధావన్‌ పరువుకు భంగం కలిగించే విధంగా ఆయేషా ఉద్దేశపూర్వకంగా తోటి క్రికెటర్లు, బీసీసీఐ, ఐపీఎల్ జట్టు యాజమాన్యానికి తప్పుడు సందేశాలు పంపించిందని రుజువయ్యింది. తన మొదటి భర్తతో కలిగిన ఇద్దరు కూతుళ్ల ఫీజులు, ఇతరత్రా ఖర్చుల కోసం కూడా ధావన్‌ నుంచి ఆమె డబ్బులు డిమాండ్‌ చేసినట్లు కోర్టు గుర్తించింది. ధావన్‌ చేసిన ఆరోపణలన్నీ నిజమని తేలడంతో కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అయితే, తన కుమారుడి శాశ్వత కస్టడీ కోసం ధావన్‌ చేసిన అభ్యర్థనపై తీర్పు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కానీ, ధావన్ తన కుమారుడితో వీడియో కాల్‌ ద్వారా టచ్‌లో ఉండేందుకు అనుమతించింది. స్కూల్‌ వెకేషన్‌ సమయంలో ఆయేషా తన కుమారుడిని భారత్‌కు తీసుకొచ్చి ధావన్‌ కుటుంబంతో సమయం గడిపేలా చూడాలని కోర్టు ఆదేశించింది.ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్‌ ఆయేషా ముఖర్జీ(boxer Ayesha Mukherjee)ని 2012లో శిఖర్‌ ధావన్‌ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కుమారుడు ఉన్నాడు. వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో 2020 నుంచి విడివిడిగా ఉంటున్నారు. 2021లో శిఖర్‌ ధావన్‌ నుంచి తాను విడిపోతున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. ఆమెకు అంతకు ముందే పెళ్లయ్యింది. మొదటి భర్త ద్వారా ఆమెకు ఇద్దరు కూతుళ్లున్నారు.

Updated On 5 Oct 2023 5:44 AM GMT
Ehatv

Ehatv

Next Story