ఐపీఎల్‌-2023లో 44వ మ్యాచ్‌లో మంగ‌ళ‌వారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు కేవలం 130 పరుగులకే ఆలౌటైంది. దీనికి సమాధానంగా గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేవలం 131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఆరంభంలోనే గ‌ట్టి షాక్ త‌గిలింది.

ఐపీఎల్‌-2023లో 44వ మ్యాచ్‌లో మంగ‌ళ‌వారం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టు, గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ(Delhi) జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు కేవలం 130 పరుగులకే ఆలౌటైంది. దీనికి సమాధానంగా గుజరాత్(Gujarat) జట్టు 20 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేవలం 131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఆరంభంలోనే గ‌ట్టి షాక్ త‌గిలింది. వృద్ధిమాన్ సాహా (0) తొలి ఓవర్‌లోనే ఖలీల్‌ అహ్మద్‌(Khaleel Ahmad) దెబ్బకు వెనుదిరిగాడు. ఆపై శుభ్‌మన్ గిల్(Shubman Gill) కూడా 6 పరుగులకే అవుటయ్యాడు. దీని తర్వాత విజయ్ శంకర్(Vijay Shankar) (6), డేవిడ్ మిల్లర్(David Miller) (0) కూడా విఫ‌ల‌మ‌య్యారు. కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) (59) పోరాడాడు. చివరి ఓవర్‌లో గుజరాత్ విజ‌యానికి 12 పరుగులు కావాలి. ఇషాంత్ శ‌ర్మ(Ishanth Sharma) ఇక వికెట్ తీసి ఆరు ప‌రుగులే ఇవ్వ‌డంతో ఢిల్లీ ఈ సీజ‌న్‌లో మూడో విజ‌యాన్ని ద‌క్కించుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి బంతికే మహ్మద్ షమీ(Mohammad Shami) ఫిల్ సాల్ట్‌(Phillip Salt)ను అవుట్ చేయడం ద్వారా బలమైన ఆరంభాన్ని అందించాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్(David Warner) (2), రిలే రస్సో (8), మనీష్ పాండే(Manish Pandey) (1), ప్రియమ్ గార్గ్ (10) కూడా త్వ‌ర‌గా పెవిలియన్ బాట పట్టారు. దీంతో ఢిల్లీ కేవలం 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే.. అమన్ ఖాన్(Aman Khan) 51, అక్షర్ పటేల్ (Axar Patel)27 పరుగుల ఇన్నింగ్స్ తో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరుకు చేరుకుంది. గుజరాత్ తరఫున మహ్మద్ షమీ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ బౌల‌ర్లో ఇషాంత్ శ‌ర్మ రెండు, ఖ‌లీల్ అహ్మ‌ద్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల‌తో రాణించిన మహ్మద్ షమీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ల‌భించింది.

Updated On 2 May 2023 9:49 PM GMT
Yagnik

Yagnik

Next Story