ఐపీఎల్ 50వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీని ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 181 పరుగులు చేసింది. బ‌దులుగా ఢిల్లీ 16.4 ఓవర్లలో మూడు వికెట్లకు 187 పరుగులు చేసి విజయం సాధించింది.

ఐపీఎల్ 50వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)పై ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) విజయం సాధించింది. ఢిల్లీ(Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ(RCB)ని ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plessis) మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు(Bengaluru) నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 181 పరుగులు చేసింది. బ‌దులుగా ఢిల్లీ 16.4 ఓవర్లలో మూడు వికెట్లకు 187 పరుగులు చేసి విజయం సాధించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించి ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో 10వ స్థానం నుంచి 9వ స్థానానికి ఎగబాకింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదో ఓటమిని చవిచూసింది. 10 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో కొనసాగుంది. ఢిల్లీ తన తదుపరి మ్యాచ్‌ని మే 10న చెన్నైలోని చెపాక్ స్టేడియం(Chepak Stadium)లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడాల్సి ఉంది. మరోవైపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో మే 9న ముంబై ఇండియన్స్‌(mumbai Indians)తో ఆర్సీబీ జట్టు తలపడనుంది.

టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 181 పరుగులు చేసింది. ఢిల్లీ 16.4 ఓవర్లలోనే మూడు వికెట్ల కోల్పోయి 187 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆట‌గాడు ఫిలిప్ సాల్ట్(Philip Salt) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 45 బంతుల్లోనే 87(ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు) పరుగులు చేసి మ్యాచ్‌ను ఏక‌ప‌క్షం చేశాడు. రిలే రస్సో 22 బంతుల్లో అజేయంగా 35 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్(Mitchell Marsh) 26, డేవిడ్ వార్నర్(David Warner) 22 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో జోష్ హేజిల్‌వుడ్, మహిపాల్ లోమ్రోర్, హర్షల్ పెటల్ ఒక్కొక్క వికెట్ ద‌క్కించుకున్నారు.

అంత‌కుముందు ఆర్సీబీ బ్యాట్స్‌మెన్‌ల‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) (55), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(45), మహిపాల్ లోమ్రోర్(55) ప‌రుగులు చేయ‌డంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 181 పరుగులు చేసింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ మార్ష్ 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఖ‌లీల్ అహ్మ‌ద్‌, ముఖేష్ కుమార్ ల‌కు ఒక్కో వికెట్ ద‌క్కింది. సూప‌ర్ ఇన్నింగ్సు ఆడిన పిలిప్ సాల్ట్‌కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్(Man of the Match) అవార్డు ద‌క్కింది.

Updated On 6 May 2023 10:09 PM GMT
Yagnik

Yagnik

Next Story