Sunrisers Hyderabad vs Delhi Capitals : స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేకపోయిన సన్‌రైజర్స్.. ఢిల్లీకి వరుసగా రెండో విజయం
ఐపీఎల్-2023 సీజన్ 34వ మ్యాచ్‌లో సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 7 పరుగుల తేడాతో గెలిచి.. వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 144 పరుగులకే ఆలౌటైంది. అనంతరం హైదరాబాద్ జట్టు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో ఛేజింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు ఆరంభం పేలవంగా ఆడింది.
ఐపీఎల్-2023 సీజన్ 34వ మ్యాచ్‌లో సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 7 పరుగుల తేడాతో గెలిచి.. వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ(Delhi) జట్టు 144 పరుగులకే ఆలౌటైంది. అనంతరం హైదరాబాద్(hyderabad) జట్టు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో ఛేజింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు ఆరంభం పేలవంగా ఆడింది. హ్యారీ బ్రూక్(Harry Brook) కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఆరో ఓవర్లో ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) 49 పరుగులు చేసి వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠి(Rahul Tripati) బ్యాటింగ్‌లో 15 పరుగులు, అభిషేక్ శర్మ(Abishek Sharma) 5 పరుగులు చేశారు. హెన్రిచ్ క్లాసెన్(Henrich Klassen) 31 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. అయితే చివరి ఓవర్‌లో 12 పరుగులు కావాల్సివుండగా.. చేయలేక జట్టు ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్(Axar Patel), నోకియా తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఆరంభం కూడా చాలా దారుణంగా ఉంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(Philip Salt) ఖాతా తెరవకుండానే 0 పరుగుల వద్ద ఔటయ్యాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్(David Warner) 21, మిచెల్ మార్ష్(Mitchell Marsh) 25 పరుగులు మాత్రమే చేశారు. సర్ఫరాజ్ ఖాన్(Sarfaraj Khan) కూడా 10 పరుగుల స్వల్ప ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. అక్షర్ పటేల్(34), మనీష్ పాండే(34) పరుగులు చేసి బోర్డుపై పోరాడగలిగే స్కోరును ఉంచారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో మరోమారు తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న అక్షర్ పటేల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.