Delhi Capitals vs Mumbai Indians : ముంబైపై దుమ్ము లేపిన ఢిల్లీ
ఐపీఎల్ 2024లో 43వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచిన ముంబై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2024లో 43వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచిన ముంబై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. అదే సమయంలో ముంబై ఆరు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేయగలిగింది. ముంబై జట్టులో తిలక్ వర్మ రాణించాడు. ఈ యువ బ్యాట్స్‌మెన్ 63 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయినా జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఎంఐ పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ ఎనిమిది పరుగులు, ఇషాన్ కిషన్ 20, సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు చేసి వెనుదిరిగారు. దీంతో హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. అతను 46 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీపై నెహాల్ నాలుగు పరుగులు, టిమ్ డేవిడ్ 37 పరుగులు, మహ్మద్ నబీ ఏడు పరుగులు, పీయూష్ చావ్లా 10 పరుగులు, ల్యూక్ వుడ్ (నాటౌట్) తొమ్మిది పరుగులు చేశారు. ఢిల్లీ తరఫున రసిఖ్ సలామ్, ముఖేష్ కుమార్ చెరో మూడు వికెట్లు తీశారు. కాగా, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు ఢిల్లీ జట్టులో మెక్ ప్రెజర్(84), అభిషేక్(36), హోప్(41),స్టబ్స్(48), పంత్(29) రాణించడంతో భారీ స్కోరు సాధించింది.