ఐపీఎల్-2023లో గురువారం జ‌రిగిన‌ 28వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 10 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఛేద‌న‌లో చివరి ఓవర్‌లో ఢిల్లీ జట్టు విజయం సాధించింది.

ఐపీఎల్-2023లో గురువారం జ‌రిగిన‌ 28వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు(Kolkata Knight Riders), ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)తో తలపడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium) లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ(Delhi) జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్(KKR) 10 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఛేద‌న‌లో చివరి ఓవర్‌లో ఢిల్లీ జట్టు విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున డేవిడ్ వార్నర్(David Warner) 57 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మ‌రో ఓపెన‌ర్‌ పృథ్వీ షా(Prithvi Shah) 13 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్(Mitchell Marsh) 2 మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు. ఫిలిప్‌ సాల్ట్(Philip Salt) కూడా 5 పరుగుల‌కే వెనుదిరిగాడు. త‌ర్వాత వ‌చ్చిన మనీష్ పాండే(Manish Pandey) 21 పరుగులు చేసి ఔట‌య్యాడు. ఒక దశలో మ్యాచ్‌పై పట్టు సాధించి కేకేఆర్ జట్టు పుంజుకుంది. అయితే అక్షర్ పటేల్ 19 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి(Varun Chakravarthy), అనుకూల్ రాయ్‌(Anukul Roy), నితీష్ రాణా(Nitish Rana) త‌లా రెండేసీ వికెట్లు నేల‌కూర్చారు.

ఈ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు త‌క్కువ‌ స్కోరుకే కుప్పకూలింది. కేకేఆర్ ఓపెనర్ జాసన్ రాయ్ 43 పరుగులతో ఆక‌ట్టుకున్నాడు. మిగ‌తా బ్యాట్స్‌మెన్లు లిటన్ దాస్ (4), వెంకటేష్ అయ్యర్ (0), నితీష్ రాణా (4), మన్‌దీప్ సింగ్ (12) రింకు సింగ్ (6), సునీల్ నరేన్ (4) అంద‌రూ దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. చివర్లో ఆండ్రీ రస్సెల్ 38 పరుగులు చేయ‌డంతో కేకేఆర్ 127 ప‌రుగుల‌తో గౌరవప్రదమైన స్కోరును ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ఇషాంత్ శ‌ర్మ, నోకియా, కుల్‌దీప్‌, అక్స‌ర్ ప‌టేల్ త‌లా రెండేసీ వికెట్లు ప‌డ‌గొట్టారు.

Updated On 20 April 2023 9:02 PM GMT
Yagnik

Yagnik

Next Story