ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ చైర్మన్ పార్థ్ జిందాల్ మంగళవారం ప్రకటించారు.

ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్(Rishab Pant) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) చైర్మన్ పార్థ్ జిందాల్ మంగళవారం ప్రకటించారు. 14 నెలల తర్వాత క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన రిషబ్ పంత్.. ఐపీఎల్ 2024లో బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా ద్విపాత్రాభిన‌యం చేయాల్సివుంది. అయితే పంత్ వికెట్ కీపింగ్‌పై ఇంకా సందేహాలు ఉన్నాయి.

డిసెంబర్ 31, 2022న రిషబ్ పంత్ ఢిల్లీ నుండి రూర్కీకి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి, ఆ తర్వాత అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది. దీంతో అతను ఐపీఎల్ 2023లో ఆడలేకపోయాడు. అతని గైర్హాజరీలో డేవిడ్ వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా నియమించారు. గత సీజన్‌లో వార్నర్‌ నాయకత్వంలో ఢిల్లీ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీంతో ఇప్పుడు రిషబ్ పంత్ ఐపీఎల్ 2024లో బ్యాటింగ్‌కే కాకుండా కెప్టెన్సీకి కూడా సిద్ధంగా ఉండాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

గత వారం పంత్ NCA నుండి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన పార్థ్ జిందాల్ మాట్లాడుతూ.. రిషబ్‌ను తిరిగి మా కెప్టెన్‌గా స్వాగతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము నూత‌నోత్సాహంతో కొత్త సీజన్ కోసం ఎదురు చూస్తున్నందున.. అతడు మరోసారి మా జట్టులోకి తిరిగి రావడం కోసం ఎదురుచూస్తున్నామ‌ని పేర్కొన్నాడు.

రిష‌బ్ పంత్ ఐపీఎల్ కేరీర్‌లో మొత్తం 98 మ్యాచ్‌లు ఆడి 2,838 పరుగులు చేసాడు. అందులో అతను ఒక సెంచరీ, 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో పంత్ అత్యధిక స్కోరు 128 నాటౌట్.

Updated On 19 March 2024 9:50 PM GMT
Yagnik

Yagnik

Next Story