Teamindia : దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సిరీస్ నుంచి ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ తన పేరును ఉపసంహరించుకున్నాడు. కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
దక్షిణాఫ్రికా(South Africa)తో వన్డే సిరీస్(One Day Series)కు ముందు భారత్(India)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సిరీస్ నుంచి ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్(Deepak Chahar) తన పేరును ఉపసంహరించుకున్నాడు. కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ(Medical Emergency) కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ శనివారం ఈ సమాచారాన్ని ఇచ్చింది. దీపక్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్(Akashdeep) ను జట్టులోకి తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. అదే సమయంలో ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
షమీ టెస్టు సిరీస్‌లో పాల్గొనడం ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. షమీ ఫిట్‌నెస్‌ను బీసీసీఐ వైద్య బృందం క్లియర్ చేయకపోవడంతో అతడు రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే షమీ స్థానాన్ని బోర్డు మాత్రం ప్రకటించలేదు.
చివరి రెండు వన్డేల్లో శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) ఆడడని బీసీసీఐ తెలిపింది. డిసెంబరు 17న జోహన్నెస్‌బర్గ్‌లో జరిగే తొలి వన్డే ముగిసిన తర్వాత టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు అయ్యర్ టెస్టు జట్టులో చేరనున్నాడు. అతను రెండు, మూడో వన్డేలకు అందుబాటులో ఉండడు. అయ్యర్ ఇంటర్-స్క్వాడ్ గేమ్‌లో పాల్గొంటాడు.
భారత వన్డే జట్టు :
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (మొదటి వన్డేకు మాత్రమే), కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఆకాష్ దీప్.
టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ టెస్టు జట్టులో చేరనున్నారు. వన్డే సిరీస్ సమయంలో వీరు జట్టుతో ఉండరు. ద్రవిడ్, అతని కోచింగ్ బృందం ఇంటర్-స్క్వాడ్ మ్యాచ్‌లు కాకుండా టెస్ట్ సిరీస్ సన్నాహాలపై దృష్టి పెడుతుంది. వన్డే జట్టుకు భారత్ ఎ కోచింగ్ స్టాఫ్ సహాయం అందిస్తారు. సితాన్షు కోటక్ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. బౌలింగ్ కోచ్‌గా రాజీబ్ దత్తా, ఫీల్డింగ్ కోచ్‌గా అజయ్ రాత్రా వ్యవహరిస్తారు.