చెన్నై సూపర్ కింగ్స్ 77 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ప్లేఆఫ్‌కు చేరిన రెండో జట్టుగా అవతరించింది. చెన్నై 14 లీగ్ మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలతో 17 పాయింట్లు సాధించింది. కాగా, ఢిల్లీ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుండి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి 223 పరుగులు చేసింది.

చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 77 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)ను ఓడించి ప్లేఆఫ్‌(Playoffs)కు చేరిన రెండో జట్టుగా అవతరించింది. చెన్నై(Chennai) 14 లీగ్ మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలతో 17 పాయింట్లు సాధించింది. కాగా, ఢిల్లీ(Delhi) జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుండి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి 223 పరుగులు చేసింది. చేధ‌న‌కు దిగిన‌ ఢిల్లీ జట్టు 146 పరుగులకే ఆలౌటై.. 77 పరుగుల తేడాతో ఓడిపోయింది.

చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్టులో డెవాన్ కాన్వే(Devon Conway) 87, రీతురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad) 79 పరుగులు చేయ‌డంతో భారీ స్కోరు చేసింది. సమాధానంగా ఢిల్లీ జట్టు 146 పరుగులు మాత్రమే చేసింది. చెన్నైజ‌ట్టులో దీపక్ చాహర్(Deepak Chahar) మూడు వికెట్లు తీశాడు. మతిష పతిరన, మహేశ్‌ తిక్షణ తలో రెండు వికెట్లు తీశారు. ఢిల్లీ కెప్టెన్ వార్నర్(David Warner) 86 పరుగులు చేశాడు. ఈ విజయంతో చెన్నై ప్లేఆఫ్‌కు చేరిన రెండో జట్టుగా అవతరించింది. లీగ్ దశలో చెన్నై 17 పాయింట్లు సాధించింది. దీంతో చెన్నై రెండో స్థానంలో నిలవడం ద్వారా తొలి క్వాలిఫయర్‌(Quqlifier) ఆడనుంది. దీంతో ఈ జట్టు ఫైనల్‌(Final)కు చేరేందుకు రెండు అవకాశాలు క‌లిగి ఉంది.

Updated On 20 May 2023 9:15 PM GMT
Yagnik

Yagnik

Next Story