ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో క్రిస్టియానో ​​రొనాల్డో పేరు ముందు వ‌రుస‌లో ఉంటుంది.

ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో క్రిస్టియానో ​​రొనాల్డో పేరు ముందు వ‌రుస‌లో ఉంటుంది. పోర్చుగల్‌, అల్‌ నాసర్‌ తరఫున ఆడిన ఈ లెజెండరీ ఫుట్‌బాల్‌ ఆటగాడు సోషల్‌ మీడియాలో ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలో ఒక బిలియన్ అంటే 100 కోట్ల మంది ఫాలోవర్స్‌ను టచ్ చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. అతడు కొత్తగా ప్రారంభించిన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌కు ప్రజాదరణ మరింత పెరిగింది. 39 ఏళ్ల రొనాల్డో యూట్యూబ్ ఖాతాను తెలిచాడు. ఒక వారంలోనే అతడి ఫాలోవర్స్‌ సంఖ్య 50 మిలియన్లు అంటే ఐదు కోట్లను దాటింది. ఈ క్ర‌మంలోనే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డోకు 639 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల‌లో అతడి 100 కోట్ల మంది ఫాలోవర్లలో ఇన్‌స్టాగ్రామ్ నుంచే ఎక్కువ షేర్ ఉంది. ఫేస్‌బుక్‌లో 170.5 మిలియన్లు అంటే 17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 'X'లో 113 మిలియన్లు అంటే 11 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనీస్ ప్లాట్‌ఫారమ్‌లు వీబో, కుయిషౌలో అతడికి ఫాలోవర్లు ఉన్నారు.

రొనాల్డో వ‌న్‌ బిలియన్ మార్క్‌ను దాటినట్లు వెల్లడించాడు. మనం చరిత్ర సృష్టించాం. 1 బిలియన్ ఫాలోవర్స్! ఇది కేవలం సంఖ్య కాదు.. మీ ప్రేమలో భాగం. మదీరా వీధుల నుండి ప్రపంచంలోని అతిపెద్ద వేదికల దాకా.. నేను ఎల్లప్పుడూ నా కుటుంబం, మీ కోసం ఆడాను. ఇప్పుడు మనం వ‌న్‌ బిలియన్ మార్క్‌లో ఉన్నాము. అన్ని ఒడిదుడుకుల మధ్య మీరు నాతో అడుగడుగునా ఉన్నారు. ఈ ప్రయాణం మన‌ ప్రయాణం.. మనం సాధించిన‌దానికి హద్దులు లేవని చూపించాం.. నాపై నమ్మకం ఉంచినందుకు.. మీ మద్దతుకు.. నా జీవితంలో భాగమైనందుకు ధన్యవాదాలు. కలిసి మనం జయించడం, చరిత్ర సృష్టించడం కొనసాగిద్దాం అని రాశాడు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story