2023 World Cup Finals : ఆస్ట్రేలియాకు ఇది ఎనిమిదో ఫైనల్, ఇండియాకు నాలుగోసారి!
వన్డే ప్రపంచకప్(One day Worldcup) ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లో(Ahmedabad) జరిగే ఫైనల్(Finals) పోరులో భారత్(India), ఆస్ట్రేలియాలు(Australia) తలపడతాయి. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా టీమ్ మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. 2003లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా(Team India)-ఆస్ట్రేలియా జట్టులే తలపడ్డాయి.
వన్డే ప్రపంచకప్(One day Worldcup) ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లో(Ahmedabad) జరిగే ఫైనల్(Finals) పోరులో భారత్(India), ఆస్ట్రేలియాలు(Australia) తలపడతాయి. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా టీమ్ మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. 2003లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా(Team India)-ఆస్ట్రేలియా జట్టులే తలపడ్డాయి. మళ్లీ 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్ కోసం పోరాడుతున్నాయి. ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ ఫైనల్లోకి చేరుకోవడం ఇది ఎనిమిదో సారి కావడం విశేషం. 1975లో జరిగిన మొదటి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్స్‌కు చేరుకుంది కానీ, తుది పోరులో వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలయ్యింది. తర్వాత 1987లో జరిగిన రిలయన్స్ వన్డే ప్రపంచకప్‌లోనూ ఫైనల్స్‌కు చేరుకుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన టైటిల్‌పోరులో ఇంగ్లాండ్‌ను ఓడించి కప్‌ను గెల్చుకుంది. 1996లో కూడా ఆస్ట్రేలియా ఫైనల్స్‌కు చేరుకుంది. కాకపోతే శ్రీలంక చేతిలో ఓటమి పాలయ్యింది. ఇక 1999, 2003, 2007, 2015లలో ఏకంగా కప్‌నే గెల్చుకుంది ఆస్ట్రేలియా! అంటే ఇప్పటి వరకు అయిదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా రెండు సార్లు మాత్రమే రెండోస్థానంతో సంతృప్తి చెందింది. పాపం సౌతాఫ్రికానే మళ్లీ సెమీస్ గండాన్ని గట్టెక్కలేకపోయింది. 1992లో జరిగిన సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. 1999, 2007, 2023లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయాన్ని చవి చూసింది. 2015లో మాత్రం న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.