ఎన్నాళ్ల  నుండో  ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ ఈ రోజు నుండి మొదలు కాబోతుంది. ఉమెన్స్ క్రికెట్లో ఇది ఒక హిస్టారికల్ మూమెంట్ గా భావిస్తున్నారు . త్వరలోనే మహిళా దినోత్సవం రాబోతున్న సందర్భం లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఒక ప్రతిష్టాత్మకం అని కూడా భావించవచ్చు . ముంబై లో  డి వై పాటిల్ , బ్రబౌర్న్‌ స్టేడియం వేదిక గా జరుగనున్నాయి .  ఈ రోజు మొదటి లీగ్ మ్యాచ్ జరుగనుంది . 23 […]

ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ ఈ రోజు నుండి మొదలు కాబోతుంది. ఉమెన్స్ క్రికెట్లో ఇది ఒక హిస్టారికల్ మూమెంట్ గా భావిస్తున్నారు . త్వరలోనే మహిళా దినోత్సవం రాబోతున్న సందర్భం లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఒక ప్రతిష్టాత్మకం అని కూడా భావించవచ్చు . ముంబై లో డి వై పాటిల్ , బ్రబౌర్న్‌ స్టేడియం వేదిక గా జరుగనున్నాయి . ఈ రోజు మొదటి లీగ్ మ్యాచ్ జరుగనుంది . 23 రోజులపాటు ఈ మ్యాచ్ లు సందడిచేయబోతున్నాయి .

మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ ,గుజరాత్ గాయింట్స్ మధ్య ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది ఫైనల్ మ్యాచ్ ఈనెల 26న జరుగుతుంది. ఈ సీజన్లో లో మ్యాచ్ లు అన్ని మహిళలు స్టేడియం కి వెళ్లి ఉచితంగా వీక్షించటానికి వీలుగా ఫ్రీ టికెట్స్ ని బీసీసీఐ ప్రకటించింది . స్పోర్ట్స్‌18 నెట్‌వర్క్‌లో ,జియో సినిమా యాప్‌లోనూ మ్యాచ్‌లు ప్రసారమవుతాయి. .

డబ్ల్యూపీఎల్ ఈ మొదటి సీజన్‌లో ముంబయి (కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్), బెంగళూరు (కెప్టెన్ స్మృతి మంధాన), గుజరాత్ (కెప్టెన్ బెత్ మూనీ), యూపీ (కెప్టెన్ అలీసా హీలీ), ఢిల్లీ (కెప్టెన్ మెగ్ లానింగ్) జట్లు పోటీ పడనున్నాయి. ఈరోజు గుజరాత్ వర్సెస్ ముంబయి జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ జరగోబోయే ముందు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది . బాలీవుడ్ యాక్టర్స్ డాన్సులతో స్టేడియం లో అదిరిపోయే ఏర్పాట్లు చేసారు. ప్రముఖ గాయకులతో సంగీత విభావరి కొద నిర్వహిస్తున్నారు. ఈ సారి టైటిల్ ఎవరు సొంతం చేసుకోబుతున్నారనే దాని పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది .

Updated On 4 March 2023 5:24 AM GMT
Ehatv

Ehatv

Next Story