ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) తాగే నీటిని ఎప్పుడైనా గమనించారా? ఆయన తాగే నీరు నల్లరంగులో ఉండటాన్ని చూశారా? ఆయనే కాదు, కరణ్‌ జోహార్‌(Karan johar), శ్రుతి హాసన్‌(Shruti haasan) వంటి సెలబ్రిటీలు కూడా ఈ బ్లాక్‌ వాటర్‌నే(Black water) తాగుతారు. ఏమిటీ వాటర్‌ స్పెషాలిటీ? మనం తాగే నీటికి, దీనికి తేడా ఏమిటి? ఇంతకు ముందు లేదు కానీ ఇప్పుడు బ్లాక్‌ వాటర్‌ చాలా ఫేమస్సయ్యింది. సెలబ్రిటీలలో చాలా మంది దీన్నే తాగుతున్నారు.

ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) తాగే నీటిని ఎప్పుడైనా గమనించారా? ఆయన తాగే నీరు నల్లరంగులో ఉండటాన్ని చూశారా? ఆయనే కాదు, కరణ్‌ జోహార్‌(Karan johar), శ్రుతి హాసన్‌(Shruti haasan) వంటి సెలబ్రిటీలు కూడా ఈ బ్లాక్‌ వాటర్‌నే(Black water) తాగుతారు. ఏమిటీ వాటర్‌ స్పెషాలిటీ? మనం తాగే నీటికి, దీనికి తేడా ఏమిటి? ఇంతకు ముందు లేదు కానీ ఇప్పుడు బ్లాక్‌ వాటర్‌ చాలా ఫేమస్సయ్యింది. సెలబ్రిటీలలో చాలా మంది దీన్నే తాగుతున్నారు. స్వచ్ఛమైన నీటికి రంగు ఉండదు కానీ ఈ వాటర్‌ మాత్రం బ్లాక్ కలర్‌లో ఉంటుంది. అలాగని స్వచ్ఛమైంది కాదనుకునేరు. స్వచ్ఛమైనదే! ఈ వాటర్‌ తాగితే అప్పటి వరకు శరీరం కోల్పోయిన నీరు తక్షణం భర్తీ అవుతుందట! మనం ఎక్సర్‌సైజ్‌ గట్రాలు చేసినప్పుడు ఒంట్లోనీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది కదా! అలా కోల్పోయిన నీటిని తక్షణం పొందాలంటే బ్లాక్‌ వాటర్‌ తాగితే సరి అని అంటున్నారు నిపుణులు. ఈ వాటర్‌లో బోల్డన్నీ పోషకాలు ఉంటాయి. శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపించే డిటాక్స్‌ డ్రింక్‌గా ఈ వాటర్‌ పని చేస్తుందట! ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపించడంలో పవర్‌ఫుల్గా పని చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైనదేమిటంటే ఈ వాటర్‌ను తాగితే ముసలితనం రాదట! శరీరంలోని యాసిడ్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుందని, ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని, ఇమ్యూనిటీ పెరుగుతుందని అంటున్నారు. బ్లాక్‌ వాటర్‌ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందట! ఫలితంగా జీవ క్రియల పనితీరు కూడా మెరుగుపడుతుందట! దాంతో శరీరంలో కలస్ట్రాల్‌ పెరిగే ఛాన్స్‌ అసలు ఉండదట! రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారట! మరి మనం రెగ్యులర్‌గా తీసుకునే మామూలు వాటర్‌తో ఇలాంటి లాభాలు ఉండవా? అంటే ఉంటాయి. కాకపోతే ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగాలి. రోజంతా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేలా 12-15 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ శరీరానికి తగినంత నీరు అందితే.. బ్లాక్‌ వాటర్‌ వల్ల పొందే ప్రయోజనాలనే మాములు వాటర్‌తో కూడా సొంతం చేసుకుంటామని అన్నారు. నేరుగా నల్లా నీటిని తాగకూడదని, గోరువెచ్చగా కాగించి చల్లార్చి తాగితేనే లాభాలుంటాయి. బ్లాక్‌ వాటర్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీఉకుటే శరీరంలో ఆల్కలైన్‌ స్థాయిలు పెరిగిపోయి గ్యాస్‌ ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. వికారం, వాంతులు, చర్మ సమస్యలు తలెత్తుతాయట!

Updated On 2 April 2024 5:41 AM GMT
Ehatv

Ehatv

Next Story