దుబాయ్‌లో(Dubai) రేపు ఐపీఎల్ వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశ, విదేశీ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. రేపు మ.1 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 1166 మంది క్రికెటర్లు(Cricketers) ఈ వేలంలో పేర్లు నమోదు చేసుకున్నారు. 333 మందిని షార్ట్‌లిస్ట్‌ చేశారు. ఇందులో 214 మంది భారత క్రీడాకురులు ఉంటే.. 119 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అన్ని ఫ్రాంచైజీలు 77 మందిని కొనుక్కోనున్నాయి.

దుబాయ్‌లో(Dubai) రేపు ఐపీఎల్ వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశ, విదేశీ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. రేపు మ.1 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 1166 మంది క్రికెటర్లు(Cricketers) ఈ వేలంలో పేర్లు నమోదు చేసుకున్నారు. 333 మందిని షార్ట్‌లిస్ట్‌ చేశారు. ఇందులో 214 మంది భారత క్రీడాకురులు ఉంటే.. 119 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అన్ని ఫ్రాంచైజీలు 77 మందిని కొనుక్కోనున్నాయి. భారత్‌లో(Bharat) కాకుండా ఇతర దేశంలో ఐపీఎల్(IPL) వేలం వేయడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌కు(New Zealand) చెందిన రచిన్‌ రవీంద్ర (Rachin Ravindra) ప్రధాన ఆకర్షణగా ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ట్రేవిస్ హెడ్, మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్‌ ఆటగాళ్లు ఈ వేలంలో ఉంన్నారు. అన్ని ఫ్రాంచైజీలు వీరిపై దృష్టి పెట్టడంతో ఈ క్రికెటర్ల ధర భారీగా పలికే అవకాశం ఉంది. ఈ ఆక్షన్‌ను స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌(Star sports network), జియో సినిమా ఓటీటీలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

క్రికెటర్లను దక్కించుకునేందుకు 10 ఫ్రాంచైజీలు(Franchise) కలిపి రూ.262.39 కోట్లు వెచ్చిస్తాయి. గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat titans) వద్ద రూ.38.15 కోట్ల ఉన్నాయి.. అత్యల్పంగా లక్నో సూపర్‌ జెయింట్స్ వద్ద 13.15 కోట్లు మాత్రమే ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్(Hyderabad) వద్ద 34 కోట్లు ఉన్నాయి. సౌతాఫ్రికాకు చెందిన 17 ఏళ్ల క్వేనా మఫాకా అత్యంత చిన్నవయసు క్రీడాకారుడు కాగా.. ఆఫ్గన్‌కు చెందిన 38 ఏళ్లమహ్మద్ నబీ అత్యధిక వయసున్న క్రీడాకారుడు.

Updated On 18 Dec 2023 4:45 AM GMT
Ehatv

Ehatv

Next Story