టి-20 ప్రపంచకప్‌లో భాగంగా బ్రిడ్జ్‌టౌన్‌లో ఈరోజు జరిగే టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. అయితే, కెన్సింగ్టన్ ఓవల్‌లో వర్షం వచ్చే అవకాశం ఉంది.
టి-20 ప్రపంచకప్(T20 Worl Cup)లో భాగంగా బ్రిడ్జ్‌టౌన్(Bridgetown)లో ఈరోజు జరిగే టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా(South Africa)తో భారత్ (India) తలపడనుంది. అయితే, కెన్సింగ్టన్ ఓవల్(Kensington Oval)లో వర్షం వచ్చే అవకాశం ఉంది. ట్రినిడాడ్‌లో జరిగిన మరో పోరులో దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తు చేయగా, గయానాలో జరిగిన సెమీఫైనల్‌లో భారత్ ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. అయితే ఫైనల్ రోజు వర్షం వస్తే రిజర్వ్ డేని కేటాయించింది ఐసీపీ. శనివారం మ్యాచ్‌ను పూర్తి చేయలేకపోతే, రిజర్వ్ డే అయిన ఆదివారం రెండు జట్లూ మరోసారి రంగంలోకి దిగుతాయి. బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్‌టౌన్‌లో మ్యాచ్ ప్రారంభం సందర్భంగా భారీ వర్షం కురిసింది.
వాతావారణ శాఖ ప్రకారం జల్లులు మరియు ఉరుములతో కూడిన వర్షం కారణంగా కొన్ని అంతరాయాలు ఏర్పడవచ్చు. మ్యాచ్ సమయంలో వర్షం శాతం 51 వరకు పెరిగే అవకాశముందని చెప్తున్నారు. ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉంటుంది, అప్పుడప్పుడు అక్కడక్కడా సూర్యరశ్మి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయని తెలిపింది. ఉష్ణమండల తుఫాన్ వల్ల మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. అయితే టాస్‌కు ముందే అంపైర్లు ఔట్‌ఫీల్డ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని ఐసీసీ వర్గాలు తెలిపాయి. భారత్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన రెండో సెమీఫైనల్ కూడా వర్షం కారణంగా ఆలస్యమైంది. వర్షం కారణంగా కొన్ని అంతరాయాలు ఉన్నప్పటికీ పూర్తి మ్యాచ్ పూర్తయింది. ఇరు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడితే ఫలితం వస్తుందని లేదంటే ఐసీసీ కేటాయించిన రిజర్వ్ డేలో మ్యాచ్ కొనసాగుతుందని ఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. మ్యాచ్ పూర్తయ్యేందుకే కృషి చేస్తామని వర్షం కారణంగా సాధారణ ఓవర్లు కూడా ఆడకపోతేనే రిజర్వ్ డే నాడు మ్యాచ్ కొనసాగుతుందని చెప్తున్నారు.