స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి(Virat Kholi) దేశదేశాల్లో అభిమానులున్నారు. అంతెందుకు మన దాయాది దేశం పాకిస్తాన్‌లో విరాట్ అంటే పడి చచ్చిపోతారు. అతడిని కలుసుకోవాలని, కలిసి సెల్ఫీ దిగాలని ముచ్చపడతారు. వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌(Wicket Keeper) జోషువా డా సిల్వా(Joshua da Silva) తల్లిగారికి ఇదే కోరిక ఉండింది. ఆమె కోరిక ఎట్టకేలకు శుక్రవారం నెరవేరింది. భారత్ - వెస్టిండీస్(Ind-West Indies) మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భాగంగా విరాట్‌ కోహ్లిని ఆమె కలుసుకున్నారు.

స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి(Virat Kohli) దేశదేశాల్లో అభిమానులున్నారు. అంతెందుకు మన దాయాది దేశం పాకిస్తాన్‌లో విరాట్ అంటే పడి చచ్చిపోతారు. అతడిని కలుసుకోవాలని, కలిసి సెల్ఫీ దిగాలని ముచ్చపడతారు. వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌(Wicket Keeper) జోషువా డా సిల్వా(Joshua da Silva) తల్లిగారికి ఇదే కోరిక ఉండింది. ఆమె కోరిక ఎట్టకేలకు శుక్రవారం నెరవేరింది. భారత్ - వెస్టిండీస్(Ind-West Indies) మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భాగంగా విరాట్‌ కోహ్లిని ఆమె కలుసుకున్నారు. రెండో రోజు ఆటపూర్తయ్యాక టీమిండియా(Team India) ప్లేయర్లు హోటల్‌కు వెళ్లేందుకు బస్‌ ఎక్కుతుండగా డా సిల్వా తల్లి కోహ్లిని కలిశారు. కోహ్లిని చూడగానే ఆమె ఆనందం అంబరమంత అయ్యింది. కోహ్లిని ప్రేమపూర్వకంగా కౌగిలించుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'నేను కోహ్లిని చూడటానికే స్టేడియంకు వచ్చాను. నేను అతడిని కలవడం ఇదే మొదటి సారి. అతడు గొప్ప మనసు గల వ్యక్తి. అదే విధంగా అద్భుతమైన టాలెంట్‌ ఉన్న ఆటగాడు. నా కొడుకు జాషువా డా సిల్వా కూడా అతని నుండి చాలా నేర్చుకుంటాడని భావిస్తున్నాను' అని చెప్పుకొచ్చారు. రెండో ఆట సందర్భంగా కోహ్లి బ్యాటింగ్‌‌కు చేస్తున్నప్పుడు వికెట్ల వెనుక జోషువా మాట్లాడుతూ.. ‘మా అమ్మ నాకు ఫోన్ చేసి నేను విరాట్‌ను చూసేందుకు వస్తున్నాను అని చెప్పింది. అది నేను నమ్మలేకపోతున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సంభాషణంతా స్టంప్‌ మైక్‌లో స్పష్టంగా రికార్డు అయ్యింది. ఇప్పుడు నిజంగానే ఆమె కోహ్లీని చూడటానికి వచ్చారు. కలుసుకున్నారు కూడా.

Updated On 22 July 2023 5:47 AM GMT
Ehatv

Ehatv

Next Story