వన్డే ప్రపంచకప్‌లో(One day World Cup) పాకిస్తాన్‌(Pakistan) సెమీ ఫైనల్‌కు(Semi finals) చేరడం దుర్లభం. ఏ అద్భుతాలు కూడా పాకిస్తాన్‌ను సెమీస్‌ బెర్తుకు చేర్చలేవు. అత్యద్భుతంఅంటారే.. అది జరగాలి.. అప్పుడు కూడా పాకిస్తాన్‌ సెమీస్‌కు చేరుతుందని చెప్పలేం! ఆల్‌రెడీ టేబుల్‌లో టాప్‌ ఫోర్‌ టీమ్స్‌ సెమీస్‌కు చేరినట్టే! నిన్న శ్రీలంకతో(Sri lanka) జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్‌(New Zealand) భారీ తేడాతో గెలిచి సెమీస్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇ

వన్డే ప్రపంచకప్‌లో(One day World Cup) పాకిస్తాన్‌(Pakistan) సెమీ ఫైనల్‌కు(Semi finals) చేరడం దుర్లభం. ఏ అద్భుతాలు కూడా పాకిస్తాన్‌ను సెమీస్‌ బెర్తుకు చేర్చలేవు. అత్యద్భుతంఅంటారే.. అది జరగాలి.. అప్పుడు కూడా పాకిస్తాన్‌ సెమీస్‌కు చేరుతుందని చెప్పలేం! ఆల్‌రెడీ టేబుల్‌లో టాప్‌ ఫోర్‌ టీమ్స్‌ సెమీస్‌కు చేరినట్టే! నిన్న శ్రీలంకతో(Sri lanka) జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్‌(New Zealand) భారీ తేడాతో గెలిచి సెమీస్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పుడు సెమీఫైనల్లో న్యూజీలాండ్‌ జట్టు టీమిండియాతో(Team india) తలపడాల్సి వుంటుంది. పాకిస్తాన్‌ సెమీఫైనల్‌కు చేరాడానికి ఆ జట్టు ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో నవంబర్‌ 11వ తేదీన జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌ మొదట బ్యాటింగ్‌ చేసి భారీ స్కోరును చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంగ్లాండ్‌ను 287 పరుగుల తేడాతో ఓడించాలి. అంటే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 300 పరుగులు చేసిందనుకుందాం! ఇంగ్లాండ్‌ను 13 పరుగులకు ఆలౌట్‌ చేయాల్సి ఉంటుంది. సపోజ్‌ పర్‌సపోజ్‌ 350 రన్స్‌ చేసిందే అనుకుందాం! అప్పుడు ఇంగ్లాండ్‌ను 63 పరుగులకు ఆలౌట్‌ చేయాలి. ఒకవేళ టాప్‌ ఆర్డర్‌ బాగా ఆడి 400 పరుగులు చేస్తే ప్రత్యర్థి జట్టును 112 పరుగులకు ఆలౌట్‌ చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్ టీమ్‌ 400 స్కోరు చేస్తుందా అన్నది అనుమానమే! ఎందుకంటే వన్డే మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ ఇప్పటి వరకు 400 పరుగుల స్కోరు చేయలేదు. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ కనుక టాస్‌(Toss) ఓడిపోయి ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకుంటే మాత్రం బరిలో దిగకుండానే పాకిస్తాన్‌ సెమీస్‌ ఆశలకు షట్టర్‌ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్‌ విసిరే టార్గెట్ను పాకిస్తాన్‌ మూడు ఓవర్లలో ఛేదించాలి. ఇది మానవమాత్రులకు సాధ్యం కాని విషయం. సో.. ప్లాన్‌ బి ఆప్షన్‌ ఏ రకంగానూ వర్క్‌ అవుట్‌ కాదు.. అంచేత పాకిస్తాన్‌ ప్లాన్‌ బి ఆప్షన్‌ను ఎంచుకోవాలని ఆ దేశ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌(Wasim Akram) అంటున్నాడు. ఓ స్థానిక టీవీ ఛానెల్ చర్చలో పాల్గొన్న వసీం అక్రమ్‌ తన జట్టుపై సెటైర్లు విసిరారు. ఏం చేస్తే పాకిస్తాన్‌ సెమీస్‌కు వస్తుందో చెప్పాడు. పాకిస్తాన్‌ మొదట బ్యాటింగ్‌ చేసి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని, ఆ తర్వాత ఇంగ్లాండ్‌ టీమ్‌ మొత్తాన్ని డ్రెస్సింగ్‌ రూమ్‌లో పెట్టి తాళం వేయాలని చెప్పాడు. వారిని గదిలోంచి బయటకు రానియకుండా చేసి వారందరినీ టైమ్డ్‌ ఔట్‌
అయ్యేలా చేయాలని వసీం అక్రమ్‌ వ్యంగ్యంగా కామెంట్‌ చేశాడు. ఇదే టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔటైన విషయం తెలిసిందే! దీన్ని దృష్టిలో పెట్టుకునే వసీం అక్రమ్‌ పాక్‌ టీమ్‌పై సెటైర్లు వేశాడని అనుకోవాలి.

Updated On 10 Nov 2023 8:04 AM GMT
Ehatv

Ehatv

Next Story