ఇండియా- ఆస్ట్రేలియా (india-australia) సిరీస్‌ విజేతను డిసైడ్‌ చేసే థర్డ్‌ వన్డేకు చెన్నైలోని చెపాక్‌ స్టేడియం (Chepak stadium) రెడీ అయ్యింది. బుధవారం జరిగే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది సిరీస్‌ను సొంతం చేసుకోవాలని అటు ఆస్ట్రేలియా, ఇటు ఇండియా తహతహలాడుతున్నాయి. విశాఖపట్నం (vizag)లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఘోరంగా దెబ్బతింది..!

ఇండియా- ఆస్ట్రేలియా (india-australia) సిరీస్‌ విజేతను డిసైడ్‌ చేసే థర్డ్‌ వన్డేకు చెన్నైలోని చెపాక్‌ స్టేడియం (Chepak stadium) రెడీ అయ్యింది. బుధవారం జరిగే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది సిరీస్‌ను సొంతం చేసుకోవాలని అటు ఆస్ట్రేలియా, ఇటు ఇండియా తహతహలాడుతున్నాయి. విశాఖపట్నం (vizag)లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఘోరంగా దెబ్బతింది..! ఆ ఓటమి స్మృతుల నుంచి బయటపడి సరికొత్త విశ్వాసంతో కీలకమైన మూడో వన్డేకు సిద్ధమయ్యింది. సిరీస్‌ను డిసైడ్‌ చేసే మూడో వన్డేలో టీమిండియా ఒక మార్పుతో బరిలో దిగే ఛాన్సుంది. వెటరన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌(kuldeep Yadav) స్థానంలో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌(washington sundar)కు అవకాశం ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నదట! మొదటి రెండు వన్డేలకు ఫైనల్‌ ఎలెవన్‌లో చోటు దక్కించుకుని వాషింగ్టన్‌ సుందర్‌కు చెన్నైలో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది సుందర్‌కు హోమ్‌గ్రౌండ్‌ కావడం విశేషం. మొదటి రెండు వన్డేలలో గోల్డెన్‌ డక్‌ (golden duck) ను సాధించిన సూర్యకుమార్‌ యాదవ్‌కు ఇంకో అవకాశం ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం వైజాగ్‌ వన్డేలో ఆడిన టీమ్‌నే మూడో వన్డేకు కొనసాగించాలని అనుకుంటోంది. చెపాక్‌ స్టేడియం పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పిచ్‌పై పరుగులు చేయడం కష్టమే. సెకండ్‌ బ్యాటింగ్‌ చాలా కష్టం. రాత్రి వేళ మంచు కురిసే అవకాశం ఉంది కాబట్టి, ఆటగాళ్లు పరుగులు తీయడం కాసింత కష్టం కావచ్చు. అందుకే టాస్‌ గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా మొదట బ్యాటింగ్‌ను ఎంచుకుంటుంది.
టీమిండియా ఫైనల్‌ ఎలెవన్‌ ఇలా ఉండే అవకాశం ఉంది.

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమీ

Updated On 21 March 2023 1:43 AM GMT
Ehatv

Ehatv

Next Story