వరల్డ్ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్ కోహ్లీ(Virat Kohli)నంబర్‌ 18 జెర్సీ(Jersey Number)ని ధరించడం వెనుక ఓ కన్నీటిగాధ ఉంది.. 18 అంటే అదేదో ఫాన్సీ నంబర్‌ అని అనుకున్నారంతా! బహుశా తొమ్మిది కోహ్లీ లక్కీ నంబరేమో అని చాలా మంది భావించారు. జెర్సీ నంబర్‌ 18ను చాలా మంది ధరించారు. కానీ ఆ నంబర్‌ వినగానే మనకు టక్కున కోహ్లీనే గుర్తుకు వస్తాడు. అండర్‌-19 క్రికెట్‌ ఆడే సమయం నుంచి కోహ్లీ ఈ జెర్సీనే ధరిస్తున్నాడు.

వరల్డ్ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్ కోహ్లీ(Virat Kohli)నంబర్‌ 18 జెర్సీ(Jersey Number)ని ధరించడం వెనుక ఓ కన్నీటిగాధ ఉంది.. 18 అంటే అదేదో ఫాన్సీ నంబర్‌ అని అనుకున్నారంతా! బహుశా తొమ్మిది కోహ్లీ లక్కీ నంబరేమో అని చాలా మంది భావించారు. జెర్సీ నంబర్‌ 18ను చాలా మంది ధరించారు. కానీ ఆ నంబర్‌ వినగానే మనకు టక్కున కోహ్లీనే గుర్తుకు వస్తాడు. అండర్‌-19 క్రికెట్‌ ఆడే సమయం నుంచి కోహ్లీ ఈ జెర్సీనే ధరిస్తున్నాడు. మరో నంబర్‌ కోసం ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు.
కోహ్లీ నంబర్‌ 18 జెర్సీని ఎందుకు వేసుకుంటున్నాడంటే తన తండ్రికి గుర్తుగానట! 2006 డిసెంబర్‌ 18న కోహ్లీ తండ్రి ప్రేమ్‌ కోహ్లీ గుండెపోటుతో కన్నుమూశారు. తండ్రి మరణించిన సమయంలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్‌ కోహ్లీ కర్నాటకతో రంజీ మ్యాచ్‌ ఆడుతున్నాడు. తండ్రి మరణవార్త విన్న కోహ్లీ దుఃఖాన్ని అదిమిపెట్టుకున్నాడు. ఆటను కొనసాగించాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 90 పరుగులు చేశాడు. ఫాలోఆన్ ప్రమాదంలో ఉన్న ఢిల్లీని ఆ ముప్పు నుంచి తప్పించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తండ్రి మరణించిన రోజును జీవితంలో చీకటి రోజుగా కోహ్లీ భావిస్తాడు. నాన్న చనిపోయిన ఆ రాత్రి తనకు ఇంకా గుర్తుందని, నాన్న మరణం తర్వాత నా ఆటను కొనసాగించాలని పిలుపు వచ్చిందని కోహ్లీ తెలిపాడు. ఆ రోజు ఉదయం తాను ఢిల్లీ కోచ్‌కు ఫోన్‌ చేసి మ్యాచ్‌లో ఆడాలనుకుంటున్నట్టు చెప్పానన్నాడు కోహ్లీ. ఆటను మధ్యలో విడిచిపెట్టి రావడానికి మనస్కరించలేదని తెలిపాడు. ఆ క్షణమే తాను ఓ వ్యక్తిగా మారానని చెప్పాడు. 'నా జీవితంలో క్రికెట్‌కు ఎంతో ప్రాముఖ్యతనిస్తాను. మా నాన్న మరణించిన రోజు జ్ఞాపకార్థంగా జెర్సీ నంబరు 18గా ఎంచుకున్నాను. అదృష్టవశాత్తూ టీమిండియాలో నేను చేరేటప్పటికీ ‘జెర్సీ నంబరు 18’ ఖాళీగా ఉంది. దీంతో అదే నంబరును కొనసాగించాను' అని కోహ్లి పేర్కొన్నాడు.

Updated On 28 March 2023 3:36 AM GMT
Ehatv

Ehatv

Next Story