ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(Indian Premier League) టోర్నమెంట్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(Royal Challengers Bangalore) టీమ్‌ మాజీ కెప్టెన్‌, టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌(IPL)లో ప్రస్తుతం ఆడుతున్న తొమ్మిది యాక్టివ్‌ టీమ్స్‌లో హాఫ్‌ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా విరాట్‌ చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్‌ జెయంట్స్‌(Lucknow Super Giants)తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ ఈ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 44 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 61 పరుగులు చేశాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(Indian Premier League) టోర్నమెంట్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(Royal Challengers Bangalore) టీమ్‌ మాజీ కెప్టెన్‌, టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌(IPL)లో ప్రస్తుతం ఆడుతున్న తొమ్మిది యాక్టివ్‌ టీమ్స్‌లో హాఫ్‌ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా విరాట్‌ చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్‌ జెయంట్స్‌(Lucknow Super Giants)తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ ఈ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 44 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ మ్యాచ్‌కు ముందు మిగిలిన ఎనిమిది ఫ్రాంచైజీలపైనా విరాట్‌ కోహ్లీ హాఫ్‌ సెంచరీలు చేశాడు. ఐపీఎల్‌లో కోహ్లీది ఇది 46వ అర్థసెంచరీ. చెన్నై సూపర్‌ కింగ్స్‌పై తొమ్మిది హాఫ్‌ సెంచరీలు చేసిన కోహ్లీ, డిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)పై ఎనిమిది అర్థ సెంచరీలు చేశాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(Kolkata Knight Riders), ముంబాయి ఇండియన్స్‌(Mumbai Indians)లపై చెరో అయిదు హాఫ్‌ సెంచరీలు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(Sunrisers Hyderabd), రాజస్తాన్‌ రాయల్స్‌ల(Rajasta Royals)పై చెరో నాలుగు అర్థ సెంచరీలు, పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings), గుజరాత్‌ లయన్స్‌(Gujarat Lions), రైజింగ్‌ పూణె సూపర్‌ జెయింట్‌(Rising Pune Supergiant), డెక్కన్‌ ఛార్జర్స్‌(Deccan Chargers)లపై మూడేసి హాఫ్‌ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ పూణే వారియర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌లపై ఒక్కో అర్థ సెంచరీ చేశాడు. కొచ్చి టస్కర్స్‌ టీమ్‌పైనే కోహ్లీ అర్థ సెంచరీ చేయలేకపోయాడు. కానీ ఆ జట్టు ప్రస్తుతం లేదు.

Updated On 11 April 2023 12:04 AM GMT
Ehatv

Ehatv

Next Story