స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఎదుట అన్ని రికార్డులు సాగిలపడుతున్నాయి. ఒక్కో రికార్డును చేరిపివేస్తూ దూసుకుపోతున్నాడు కోహ్లీ. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధికసార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో ప్లేస్‌కు చేరుకున్నాడు. కోహ్లీ మొత్తం 212 హాఫ్ సెంచరీలు చేశాడు.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఎదుట అన్ని రికార్డులు సాగిలపడుతున్నాయి. ఒక్కో రికార్డును చేరిపివేస్తూ దూసుకుపోతున్నాడు కోహ్లీ. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధికసార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో ప్లేస్‌కు చేరుకున్నాడు. కోహ్లీ మొత్తం 212 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ లిస్టులో టాప్ ప్లేస్ సచిన్ టెండూల్కర్‌ది(Sachin Tendulkar)! ఇతను మొత్తం 264 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 217 అర్థ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర 216 హాఫ్ సెంచరీలతో థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. క్లోహీ తర్వాతి ప్లేస్ సౌతాఫ్రికాకు చెందిన జాక్ కలిస్ ఉన్నాడు. కలిస్ 211 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లి మరో 53 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేస్తే సచిన్ ఆల్‌టైమ్ రికార్డును అధిగమిస్తాడు. అలాగే నిన్నటి సెంచరీతో కోహ్లీ తన సెంచరీల సంఖ్యను 48కి పెంచుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఓవరాల్‌గా 78వ సెంచరీ సాధించిన కోహ్లీ లేటెస్ట్‌గా చేసిన 103 రన్స్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 26 వేల పరుగుల మైలురాయిని దాటేశాడు. సచిన్ 34,357 పరుగులు చేస్తే సంగక్కర 28,016 రన్స్ చేశాడు. పాంటింగ్ 27,483 రన్స్‌తో థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. 26000 పరుగుల మైలురాయిని కోహ్లి అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (567) చేరుకోవడం విశేషం. కొద్ది రోజుల కిందట కోహ్లి అత్యంత వేగంగా 25000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు.