రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి(Virat Kohli) మరో అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు ఆడిన ఇండియన్‌ ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్‌లో ఆడటం ద్వారా విరాట్‌ కోహ్లి ఈ అరుదైన ఫీట్‌ను సాధించనున్నాడు.

రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి(Virat Kohli) మరో అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు ఆడిన ఇండియన్‌ ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్‌లో ఆడటం ద్వారా విరాట్‌ కోహ్లి ఈ అరుదైన ఫీట్‌ను సాధించనున్నాడు. 35 ఏళ్ల విరాట్‌ కోహ్లి తన పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో నాలుగోసారి వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ మ్యాచ్‌ ఆడనున్నాడు. ఇంతకు ముందు 2011, 2015, 2019 లలో కూడా విరాట్‌ సెమీస్‌ మ్యాచ్‌ ఆడాడు. సచిన్‌ టెండూల్కర్‌ (1996, 2003, 2011), మహేంద్రసింగ్‌ ధోని (2011), 2015, 2019) మూడోసార్లు చొప్పున వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్స్ ఆడారు. భారత్‌ మొత్తంగా ఎనిమిది వన్డే ప్రపంచకప్‌ సెమీ ఫైనల్స్‌ ఆడితే అందులో విరాట్‌ కోహ్లి నాలుగింట భాగం కావడం విశేషం. ఇప్పటి వరకు టీమిండియా మూడుసార్లు మాత్రమే సెమీఫైనల్‌ను దాటి ఫైనల్స్‌కు చేరుకోగలిగింది. ఇందులో రెండుసార్లు కప్‌ను గెల్చుకుంది. 1983లో జరిగిన ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో కపిల్‌దేవ్‌ సారథ్యంలోని టీమిండియా విజయం సాధించింది. తర్వాత ఫైనల్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించి మొదటిసారి ప్రపంచకప్‌ను సాధించింది. 2003లో సౌరబ్‌ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కెన్యాను 91 పరుగుల తేడాతో ఓడించింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలయ్యంది. 2011లో మహేంద్రసింగ్‌ ధోని సారథ్యంలోని టీమిండియా సెమీ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 20 పరుగుల తేడాతో ఓడించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి ప్రపంచకప్‌ను మరోసారి సాధించింది. 1987, 1996, 2015, 2019లలో కూడా ఇండియా సెమీ ఫైనల్‌కు చేరింది. కానీ ముందుకు అడుగుపెట్టలేకపోయింది. 1987లో ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీస్‌లో కపిల్‌దేవ్‌ సారథ్యంలోని ఇండియా జట్టు ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమిపాలయ్యింది. 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. 1996లో జరిగిన సెమీస్‌లో శ్రీలంక చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. 252 పరుగులను అధిగమించడానికి నానా తంటాలు పడింది. 34.1 ఓవర్ల తర్వాత టీమిండియా ఎనిమిది వికెట్లకు 120 పరుగులు చేసి ఓటమి అంచులో ఉండింది. ఆ దశలో ఈడెన్‌ గార్డెన్స్‌లోని ప్రేక్షకులు సీట్లకు నిప్పు పెట్టారు. గ్రౌండ్‌లో వాటర్‌ బాటిళ్లు విసిరేశారు. దీంతో మ్యాచ్‌ను నిలిపి వేసిన రిఫరీ శ్రీలంకను విజేతగా ప్రకటించారు. ఇక 2015లో ధోని సారథ్యంలోని టీమిండియా సెమీస్‌లో 95 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. 329 పరుగుల లక్ష్యాన్ని అధిగమించే ప్రయత్నంలో 233 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. కిందటిసారి అంటే 2019లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లి కెప్టెన్సీలోని టీమిండియా న్యూజిలాండ్‌పై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Updated On 15 Nov 2023 4:00 AM GMT
Ehatv

Ehatv

Next Story