పుట్టినరోజే సెంచరీ(Centuray) చేసిన అరుదైన ఘనత అందుకున్నాడు కోహ్లీ(Kohli). పుట్టినరోజును మరుపురానిదిగా మార్చుకోవాలని చాలామంది అనుకుంటారు. ఇక క్రికెటర్లు తమ పుట్టిన రోజున అరుదైన ఘనత సాధించాలని కోరుకుంటారు. సెంచరీ లేదా కనీసం అర్ధసెంచరీ, అలాగే 5 వికెట్లు పడగొట్టడం లాంటి ఘనతలు అందుకోవాలనుకుంటారు.

పుట్టినరోజే సెంచరీ(Centuray) చేసిన అరుదైన ఘనత అందుకున్నాడు కోహ్లీ(Kohli). పుట్టినరోజును మరుపురానిదిగా మార్చుకోవాలని చాలామంది అనుకుంటారు. ఇక క్రికెటర్లు తమ పుట్టిన రోజున అరుదైన ఘనత సాధించాలని కోరుకుంటారు. సెంచరీ లేదా కనీసం అర్ధసెంచరీ, అలాగే 5 వికెట్లు పడగొట్టడం లాంటి ఘనతలు అందుకోవాలనుకుంటారు. తాజాగా టీమిండియా(Team india) పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ(Virat Kohli) తన పుట్టిన రోజు (నవంబర్‌ 5)న అరుదైన ఘనతను అందుకున్నారు. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో(south africa) జరుగుతోన్న మ్యాచ్‌లో విరాట్ సెంచరీ బాదాడు. మొత్తం 121 బంతులు ఎదుర్కొన్న విరాట్ 10 ఫోర్లతో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇది వన్డేల్లో విరాట్‌ కు 49వ సెంచరీ కావడం విశేషం. తద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన సచిన్‌ టెండూల్కర్‌(Sachin tendulker) (49 సెంచరీలు) రికార్డును విరాట్ సమం చేశాడు. తన పుట్టిన రోజును మరింత తీపి గుర్తుగా మార్చుకున్నాడు కోహ్లీ. కాగా వన్డే క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీకి ముందు కేవలం ఆరుగురు బ్యాటర్లు మాత్రమే తమ పుట్టినరోజున సెంచరీ కొట్టారు. వీరిలో ఇద్దరు మాత్రమే తమ పుట్టినరోజున వన్డే ప్రపంచకప్‌లో సెంచరీలు కొట్టారు. పుట్టినరోజే సెంచరీలు కొట్టిన జాబితాలో సచిన్, వినోద్‌ కాంబ్లే, జయసూర్య, రాస్‌ టేలర్, టామ్‌ లాథమ్, మిచెల్ మార్ష్‌, కోహ్లీ ఉన్నారు. ఇక మ్యాచ్‌ గురించి చెప్పాలంటే టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్‌ దూకుడుగా ఆడినా, గిల్ స్లోగా పరుగులు చేశాడు. వీరిద్దరూ ఔటయ్యాక భారత్‌ స్కోర్‌ నెమ్మదించింది. కోహ్లీ నిదానంగా ఆడుతూ సెంచరీ సాధించాడు. కోహ్లీకి తోడుగా శ్రేయాస్‌ అయ్యర్‌(shreyas Iyer) 77 పరుగులు చేసి జట్టు 300 స్కోర్‌ దాటడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలింది. ఐదు వికెట్ల తీసి సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బతీశాడు జడేజా(Jadeja).

Updated On 6 Nov 2023 2:49 AM GMT
Ehatv

Ehatv

Next Story