కోహ్లీ నిర్ణయంపై బీసీసీఐ సెక్రటరీ జే షా స్పందిస్తూ కోహ్లీ నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుందన్నారు

ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లకు దూరమైన విరాట్ కోహ్లీ సిరీస్ లో మిగిలిన మ్యాచ్ లకు కూడా దూరం అయ్యాడు. చివరి మూడు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. కోహ్లీ నిర్ణయంపై బీసీసీఐ సెక్రటరీ జే షా స్పందిస్తూ కోహ్లీ నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుందన్నారు. టెస్ట్ సిరీస్ లో జట్టులోని ఇతర ఆటగాళ్ల సమర్థ్యాలపై టీమ్ మేనేజ్ మెంట్ కు, బోర్డుకు నమ్మకం ఉందని తెలిపారు. విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టుల నుండి వైదొలుగుతున్నట్లు BCCI అధికారులు, సెలక్షన్ కమిటీ, భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు తెలియజేసినట్లు సమాచారం.

ఇక చివరి మూడు టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యార్ లు జట్టుకు దూరమయ్యారు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ భారత జట్టులోకి తిరిగి వచ్చాయి. వారు మ్యాచ్ ఫిట్ నెస్ సాధించడంతో తిరిగి భారత జట్టులో భాగమయ్యారు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్న మహ్మద్ సిరాజ్‌కు జట్టులో చోటు దక్కింది. ముఖేష్ కుమార్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా, అవేష్ ఖాన్ స్థానంలో, సెలక్షన్ కమిటీ ఆకాష్ దీప్‌ను ఎంపిక చేసింది.

ఇండియా టెస్ట్ స్క్వాడ్:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురేల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ముఖేశ్ కుమార్, ఆకాశ్ దీప్.

Updated On 10 Feb 2024 3:17 AM GMT
Yagnik

Yagnik

Next Story