అండర్‌- 19 వరల్డ్‌కప్(Under 19 World cup) భారత జట్టుకు(Team India) శుభారంభం దొరికింది. బంగ్లాదేశ్‌తో(Bangladesh) జరిగిన మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో భారత్‌ గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌(Uday Saharan) తన సహానాన్ని కోల్పోయాడు. మైదానంలో బంగ్లాదేశ్‌ క్రికెటర్ అరిఫుల్ ఇస్లాంతో(Ariful Islam) వాగ్వాదానికి దిగాడు.

అరిఫుల్‌ ఇస్లాంకు మద్దతుగా మరో ఆటగాడు మహ్ఫుజుర్ రహ్మాన్ రబ్బీ ఉదయ్‌తో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఒకరిమీదికి ఒకరు దూసుకెళ్లారు. కొట్టుకుంటారా ఏంది అన్న లెవెల్లో వీరి మౌత్‌ ఫైటింగ్‌(Sledging) అయితే జరిగింది. దీంతో అంపైర్‌ జోక్యం చేసు​కోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు 25 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత కెప్టెన్‌ ఉదయ్‌ సహారాన్‌కు ఎందుకు కోపం వచ్చిందో కారణం తెలియదు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో(Social media) వైరల్‌ మారింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌.. భారత జట్టు 7.2 ఓవర్లలో 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడడంతో సహారన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌, కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌ అర్ధ సెంచరీలతో భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మూడో వికెట్‌కు ఈ జోడి 116 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

Updated On 21 Jan 2024 1:26 AM GMT
Ehatv

Ehatv

Next Story