కరెంట్ కోతలు లేనేలేవంటోంది ప్రభుత్వం. ఉత్తిపుణ్యానికే తమపై నిలాపనిందలు వేస్తున్నారని మండిపడుతోంది. కానీ చాలా చోట్ల కరెంట్ పోతున్నదన్నది నిజం. చివరికి కరెంట్ కోతలు ఉప్పల్ స్టేడియాన్ని(Uppal Stadium) కూడా వదల్లేదు. ఇంతకు ముందేమో హెసీఎ కరెంట్ బిల్లు కట్టలేదు కాబట్టి కరెంట్ కట్ చేశామని చెప్పారు విద్యుత్ అధికారులు.
కరెంట్ కోతలు లేనేలేవంటోంది ప్రభుత్వం. ఉత్తిపుణ్యానికే తమపై నిలాపనిందలు వేస్తున్నారని మండిపడుతోంది. కానీ చాలా చోట్ల కరెంట్ పోతున్నదన్నది నిజం. చివరికి కరెంట్ కోతలు ఉప్పల్ స్టేడియాన్ని(Uppal Stadium) కూడా వదల్లేదు. ఇంతకు ముందేమో హెసీఎ కరెంట్ బిల్లు కట్టలేదు కాబట్టి కరెంట్ కట్ చేశామని చెప్పారు విద్యుత్ అధికారులు. మరి గురువారం రోజున కూడా ఉప్పల్ స్టేడియంలో కరెంట్ సమస్య వచ్చింది కదా! హెచ్‌సీఎ ఇంకా బిల్లు కట్టలేదా? సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్(SRH vs RR) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడే కరెంట్ పోయింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడ్డారు. కార్పొరేట్ బాక్సుల్లో గంటకు పైగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అంతా చీకటిమయం కావడంతో ప్రేక్షకుల దృష్టి ఆటోమాటిక్‌గా అటువైపుకు వెళ్లింది. అసలే వేడితో చచ్చిపోతున్నామని, ఈ టైమ్‌లో కరెంట్ పోవడం తమను బాధించిదని సోషల్ మీడియాలో నెటిజన్లు చెబుతున్నారు. దీనికి విద్యుత్ అధికారులు ఏ కారణం చెబుతారో చూడాలి.. సాంకేతిక సమస్యలను సాకుగా చూపిస్తారేమో!