అవును మీరు చదువుతోంది నిజమే.
అవును మీరు చదువుతోంది నిజమే. పాకిస్తాన్(Pakistan)లో టీవీలు పగిలిపోయి సరిగ్గా ఈరోజుతో రెండేళ్లు. అప్పటిదాకా బాగానే ఉందనుకున్నారు ఆ దేశం వాళ్లు.. చివరి అరగంట ఊహించని మలుపులకు దారి తీసింది. చివరికి పాకిస్తాన్ దేశం అనుకున్నది నిజం కాలేదు.. దీంతో నిరాశచెందిన ఆ దేశస్తులు తమ ఇంట్లోని టీవీలను పగలగొట్టుకున్నారు. కారణమేంటనుకుంటున్నారా..? అయితే ఇదిచూడండి..
క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్‌లు తలపడినప్పుడల్లా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంటుంది. 2022 టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య సరిగ్గా ఇదే రోజు ఆస్ట్రేలియా (Australia)వేదికగా మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం(Melbourne Cricket Stadium)లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దాదాపు చివరివరకు పాకిస్తాన్‌దే పైచేయిగా ఉంది. కానీ చివరి మూడు ఓవర్లు మ్యాచ్‌ను భారత్‌వైపునకు మళ్లించాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లీ (Kohli)ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌ను పాకిస్తాన్ అసలే మర్చిపోదు. స్టేడియంలో 90 వేల కంటే ఎక్కువ మంది ప్రేక్షకుల ముందు, భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శనతో భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. అందించాడు. చివరి ఓవర్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ 50 నాటౌట్, ఇఫ్తికర్ అహ్మద్ 51 పరుగులు చేశారు. హార్థిక్ పాండ్యాకు, అర్షదీప్‌కు చెరో మూడు వికెట్లు దక్కాయి. 160 పరుగులు విజయలక్ష్యంతో దిగిన భారత్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. టపీటపీ మంటూ టాపార్డర్ కుప్పకూలింది. 6.1 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 31/4. దీంతో భారత్ గెలుపుపై అభిమానులు ఆశలు వదులుకున్నారు. ఈ సమయంలోనే దిగాడబ్బా.. కోహ్లీ.. హార్థిక్ పాండ్యాతో కలిసి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరి ఎనిమిది బంతుల్లో భారత్ 28 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత, కోహ్లి హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్లో చాలా డ్రామా జరిగింది. విన్నింగ్ సిక్స్‌తో మ్యాచ్‌ను కోహ్లీ ముగించాడు. దీంతో చేతిలోకి వచ్చిన మ్యాచ్ చేజారిపోయిందని పాక్ అభిమానులు ఆగ్రహం చెంది.. పలు చోట్ల తమ టీవీలను తామే కిందపడేసి పగలగొట్టుకున్నారు.