ఆస్ట్రేలియా(Australia), పాకిస్తాన్(Pakistan) మధ్య మెల్‌బోర్న్‌లో(Melbourne) జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో(TEST Match) ఓ గమ్మత్తు సంఘటన చోటు చేసుకుంది. మూడో రోజు లంచ్ టైమ్ తర్వాత ఆన్‌ఫీల్డ్ అంపైర్లు(Empire), ఆటగాళ్లు గ్రౌండ్‌లోకి వచ్చారు. అయినప్పటికీ మ్యాచ్‌ను కాసింత ఆలస్యంగా మొదలు పెట్టాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియా(Australia), పాకిస్తాన్(Pakistan) మధ్య మెల్‌బోర్న్‌లో(Melbourne) జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో(TEST Match) ఓ గమ్మత్తు సంఘటన చోటు చేసుకుంది. మూడో రోజు లంచ్ టైమ్ తర్వాత ఆన్‌ఫీల్డ్ అంపైర్లు(Empire), ఆటగాళ్లు గ్రౌండ్‌లోకి వచ్చారు. అయినప్పటికీ మ్యాచ్‌ను కాసింత ఆలస్యంగా మొదలు పెట్టాల్సి వచ్చింది. అందుకు కారణం థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్(Richard Illingworth) ! ఆయన ఎలా కారణమయ్యాడంటే లిఫ్ట్‌లో(Lift) ఇరుక్కోవడం వల్ల అనుకున్న సమయానికి ఇల్లింగ్‌వర్త్ తన చైర్‌లోకి రాలేకపోయారు. ఆయన కోసమని మ్యాచ్‌ను కాసేపు ఆపారు. అయితే మ్యాచ్‌ను ఎందుకు నిలిపివేశారో గ్రౌండ్‌లో ఉన్న ఆటగాళ్లకు అర్థం కాలేదు. థర్డ్ అంపైర్ లిఫ్ట్‌లో చిక్కుకున్న విషయాన్ని ఆన్ ఫీల్డ్ అంపైర్లు చెప్పడంతో ఆటగాళ్లకు పరిస్థితి అర్థమయ్యింది. ఇల్లింగ్‌వర్త్ తన పొజిషన్ తీసుకున్న తర్వాత మ్యాచ్‌ను స్టార్ట్ చేశారు.