టీ-20 ప్రపంచకప్‌(T20 World Cup)లో పాల్గొనే టీమిండియా(TeamIndia)ను ఇవాళ ప్రకటించారు. జూన్‌ 2వ తేదీ నుంచి మొదలు కానున్న ఈ మెగా టోర్నమెంట్‌ కోసం అజిత్‌ అగార్కర్‌(Ajit Agarkar) నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ను అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి.

టీ-20 ప్రపంచకప్‌(T20 World Cup)లో పాల్గొనే టీమిండియా(TeamIndia)ను ఇవాళ ప్రకటించారు. జూన్‌ 2వ తేదీ నుంచి మొదలు కానున్న ఈ మెగా టోర్నమెంట్‌ కోసం అజిత్‌ అగార్కర్‌(Ajit Agarkar) నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ను అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. ఇండియా తన తొలి మ్యాచ్‌ను జూన్‌ 5వ తేదీన ఐర్లాండ్‌తో ఆడుతుంది. ప్రారంభమ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా టీమ్‌తో కెనడా జట్టు తలపడుతుంది. అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ న్యూయార్క్‌లో జూన్‌ 9వ తేదీన జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పోటీపడుతున్నాయి. అమెరికాలో మూడు, వెస్టిండీస్‌లో ఆరు వేదికలలో మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్‌ పోరు జూన్‌ 29న జరుగుతుంది.

భారత జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్, శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్, బుమ్రా, సిరాజ్.
ట్రావెలింగ్ రిజర్వ్‌: శుభ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్‌, అవేశ్‌ఖాన్‌

Updated On 30 April 2024 6:43 AM GMT
Ehatv

Ehatv

Next Story