న్యూజిలాండ్(New Zealand)-శ్రీలంక(Sri Lanka) జట్ల మధ్య జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ అతి కష్టంమీద గెలుపొందింది. క్వీన్స్‌టౌన్(Queenstown)లోని జాన్ డేవిస్ గ్రౌండ్(John Davies Ground)లో జరిగిన ఈ నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో గెల్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. తర్వాత బరిలో దిగిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 183 పరుగులు చేసి గెలుపొందింది.

SL vs NZ 3rd T20

న్యూజిలాండ్(New Zealand) గెలవడానికి చివరి ఓవర్‌లో పది పరుగులు అవసరమయ్యాయి. చాప్‌మన్(Chapman) మొదటి బంతికే సిక్సర్ కొట్టడంతో టార్గెట్ ఈజీ అయ్యింది. అయితే తర్వాతి న్యూజిలాండ్ వెంట వెంటనే మూడు వికెట్లను కోల్పోయింది. నాలుగో బంతికి ఒక లెగ్ బై వచ్చింది. అయిదో బంతికి రచిన్ రవీంద్ర(Rachin Ravindra) రెండు పరుగులు తీయడంతో న్యూజిలాండ్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా గెల్చుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు దాదాపుగా చేతికందేంత ఎత్తులో ఓ విమానం టేకాఫ్ అయ్యింది. అయితే శ్రీలంక ఆటగాళ్లు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. తమ ఆటను కొనసాగించారు. ప్రేక్షకులు కూడా మ్యాచ్ చూడటంలో లీనమయ్యారు. విమానం మ్యాచ్ మధ్యలో టేకాఫ్ అవుతున్న దృశ్యం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కొందరేమో ఇది కెమెరా ట్రిక్ కావొచ్చని అంటున్నారు. కొందరేమో ఇంత తక్కువ ఎత్తులోంచి విమానం వెళ్లడం ప్రమాదమే అని చెబుతున్నారు. నిజానికి జాన్ డేవిస్ పక్కనే ఎయిర్‌పోర్ట్ రన్‌వే ఉంది. రోజూ ఇక్కడ్నుంచి చాలా విమానాలు టేకాఫ్ అవుతుంటాయి. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు విమానాలు టేకాఫ్ కావడం ఇక్కడ కామన్!