ఆసియా కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌(Asia Cup Cricket Tournament) జరగడం అనుమానంగానే ఉంది. నిజానికి ఈ టోర్నమెంట్‌కు పాకిస్తాన్‌ వేదిక కావాల్సి ఉంది. భద్రత కారణాల వల్ల పాకిస్థాన్‌లో అడుగుపెట్టేందుకు బీసీసీఐ ఒప్పుకోలేదు. భారత్‌ ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు భావించింది. అంటే భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోనూ, మిగతా మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో నిర్వహించాలన్నది భారత్‌ ఆలోచన.

ఈ ప్రతిపాదన పాకిస్థాన్‌కు(pakisthan) ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక ఒప్పుకుంది. వేదిక విషయంలో పాకిస్థాన్‌, ఇండియాలు ఓ అంగీకారానికి రావడంతో టోర్నమెంట్ అనుకున్న సమయానికి అనుకున్నట్టు జరుగుతుందని అందరూ భావించారు. ఇప్పుడు శ్రీలంక(srilanka), బంగ్లాదేశ్‌లు(Bangladesh) కొత్త పితలాటకం పెట్టాయి. సెప్టెంబర్‌ మాసంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఎండలు మండిపోతాయని ఈ రెండు దేశాలు చెప్పుకొస్తున్నాయి. నిజానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, పాకిస్థాన్‌లలో కాకుండా టోర్నమెంట్‌ మొత్తాన్ని శ్రీలంకలో నిర్వహిస్తే బాగుంటుదన్న ఆలోచనను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ తాజాగా తెరపైకి తెచ్చింది. ఇంతవరకూ సైలెంట్‌గా ఉండి ఇప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్‌లు పితలాటకం పెట్టడం బాగోలేదని పాకిస్థాన్‌ మండిపడుతోంది.

ఇంతకు ముందు యుఏఈలో ఐపీఎల్‌, ఆసియా కప్‌ టీ-20 టోర్నమెంట్లు జరిగాయని, అది కూడా ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లోనేనని పాకిస్తాన్‌ గుర్తు చేసినా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు మాత్రం బెట్టు చేస్తున్నాయి. ఒకవేళ టోర్నమెంట్‌ మొత్తాన్ని శ్రీలంకలోనే నిర్వహించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ భావిస్తే మాత్రం తాము టోర్నమెంట్‌ నుంచి వైదొలుగుతామని పాకిస్తాన్ అంటోంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌ దేశాలను ఒప్పించడం కోసం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ నజమ్‌ సేథి స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దీంతో టోర్నమెంట్‌ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆసియాకప్‌-2023 జరగాల్సి ఉంది. దీనిపై వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఏసీసీ ఓ నిర్ణయం తీసుకోనుంది.

Updated On 11 May 2023 5:48 AM GMT
Ehatv

Ehatv

Next Story