తెలంగాణ సచివాలయం వీడియోను షేర్‌ చేసిన ఇంగ్లండ్‌ టీం

ఉప్పల్‌ స్టేడియం (Uppal Stadium) వేదికగా ఈరోజు నుంచి తొలిటెస్ట్ జరుగుతోంది. దీంతో తొలిటెస్ట్ కోసం ఉప్పల్‌ స్టేడియానికి బస్సులో వెళ్తున్న ఇంగ్లండ్‌ జట్టు (England Team) తెలంగాణ సచివాలయానికి (Telangana secretariat) సంబంధించిన వీడియో షేర్‌ చేసింది. ఈ వీడియోను ఇంగ్లండ్‌ బార్మీ ఆర్మీ షేర్‌ చేస్తూ మ్యాచ్‌కు వెళ్తున్నాం అన్నారు. అంతేకాకుండా సచివాలయాన్ని చూసి ఇంగ్లండ్‌ ఆటగాళ్లు వావ్‌ అనుకుంటూ వెళ్లిపోయారు. ఈ వీడియోను బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. కేసీఆర్‌ అంటే ఇదీ అంటూ ఆయన అభిమానులు పొగుడుతున్నారు.

Updated On 24 Jan 2024 11:36 PM GMT
Ehatv

Ehatv

Next Story