ఐపీఎల్ సీజన్-18 వేలంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని తెలిసింది. వచ్చే సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టు నుంచి తప్పుకోనున్నాడని సమాచారం.
ఐపీఎల్ సీజన్-18 వేలంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని తెలిసింది. వచ్చే సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టు నుంచి తప్పుకోనున్నాడని సమాచారం.సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టు నుంచి వైదొలగేందుకే నిర్ణయించుకున్నట్లు, ఐపీఎల్ వేలంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ తనకే దక్కుతుందని సూర్యకుమార్ యాదవ్ ఆశించాడు. కానీ అనూహ్యంగా జట్టు నుంచి వెళ్లిపోయిన హార్థిక్ పాండ్యాను తిరిగి తెచ్చి కెప్టెన్‌గా చేశారు. దీంతో ఫ్రాంచైజీ నిర్ణయంపై సూర్యకుమార్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నాడని, వచ్చే సీజన్ వేలంలో పాల్గొననున్నాడని సమాచారం.
మరోవైపు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో ఫ్రాంజైజీలు కూడా కొత్త కెప్టెన్‌ను తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాయట. దీంతో వచ్చే వేలంలో సూర్యకుమార్ యాదవ్ కచ్చితంగా ఏదో ఒక జట్టుకు కెప్టెన్ కానున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్-18 సీజన్‌లో భారీ బిడ్డింగ్‌తో సూర్యకుమార్ యాదవ్ ముందుకొచ్చేలా ఉన్నాడు. కొత్త జట్టుకు సారథ్యం వహించనున్నాడని, మెగా వేలానికి ముందే ఇండియన్స్ జట్టును వీడి కొత్త జట్టులో చేరనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. శ్రీలంకలో మూడు టి-20లు, మూడు వన్డేలను భారత్ ఆడుతోంది. అయితే టి-20 జట్టు కెప్టెన్‌గా ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారు. వన్డేలకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉంచారు.వచ్చే సీజన్‌లో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్?