☰
✕
శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 43 పరుగుల
x
శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను 170 పరుగులు చేసింది. ఒకానొక దశలో శ్రీలంక సొంత గడ్డపై అద్భుతమైన ఛేజింగ్ చేస్తుందని క్రికెట్ లవర్స్ ఆశించారు. అయితే అనుకున్నట్లుగా జరగలేదు. ఆఖరి 5 ఓవర్లు భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీసి టీమిండియాకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో 26 బంతుల్లో 58 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. జైశ్వాల్ 21 బంతుల్లో 40 పరుగులు, గిల్ 16 బంతుల్లో 34 పరుగులు చేశారు. కెప్టెన్ సూర్య కుమార్ ఏకంగా 26 బంతుల్లో 58 పరుగులు చేశాడు. చివర్లో రిషబ్ పంత్ 33 బంతుల్లో 49 పరుగులు చేశాడు. దీంతో భారత్ స్కోరు నిర్ణీత ఓవర్లకు 213/7 చేరింది. ఛేజింగ్ లో లంక ఓపెనర్లు పతుమ్ నిశాంక 48 బంతుల్లో 79 రన్స్ , కుశాల్ మెండిస్ 27 బంతుల్లో 45 రన్స్ చేయడంతో శ్రీలంక లక్ష్యం దిశగా సాగింది. 14 ఓవర్లకు 140/1తో నిలిచింది. ఆ తర్వాత భారత బౌలర్లు పట్టు సాధించడంతో శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలింది. రెండో మ్యాచ్ ఈరోజు జరగనుంది.
Eha Tv
Next Story