India vs Srilanka : గెలిస్తే డైరెక్ట్ సెమీస్‌కే..!
ఆరుకు ఆరు విజయాలతో దూకుడుగా ఉన్న భారత్(Team India).. నేడు శ్రీలంకతో(Srilanka) ఏడో మ్యాచ్ ఆడనుంది. ముంబై(Mumbai) వేదికగా మ.2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దాదాపు సెమీస్‌కు చేరుకున్నట్లే అయినా.. శ్రీలంకతో ఈరోజు మ్యాచ్ నెగ్గితే డైరెక్ట్ సెమీస్‌కు భారత్ దూసుకెళ్లనుంది.
ఆరుకు ఆరు విజయాలతో దూకుడుగా ఉన్న భారత్(Team India).. నేడు శ్రీలంకతో(Srilanka) ఏడో మ్యాచ్ ఆడనుంది. ముంబై(Mumbai) వేదికగా మ.2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దాదాపు సెమీస్‌కు చేరుకున్నట్లే అయినా.. శ్రీలంకతో ఈరోజు మ్యాచ్ నెగ్గితే డైరెక్ట్ సెమీస్‌కు భారత్ దూసుకెళ్లనుంది. ఆరు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనే గెలిచి బలహీనంగా ఉన్న శ్రీలంకతో మ్యాచ్ గెలవడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.పైగా చివరి మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్(Afganisthan) చేతిలో ఓటమి చెంది శ్రీలంక ఆత్మవిశ్వాసం కోల్పోయింది.
బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడే స్టేడియంలో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. టోర్నీ ముందుకు వెళ్తున్న కొద్దీ భారత్ బలపడుతున్నా.. శ్రేయాస్ అయ్యర్ ఫాం ఆందోళన కలిగిస్తోంది. ఆరు మ్యాచ్‌లు ఆడి శ్రేయాస్ అయ్యర్ ఒక అర్ధసెంచరీ సహా మొత్తం 134 పరుగులే చేశాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉండగా పేలవమైన షాట్ ఆడి వెనుదిరగడంతో శ్రేయాస్‌పై విమర్శలు లేవనెత్తాయి. మరోవైపు హార్థిక్ పాండ్యా కూడా గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఒకటి, రెండు రోజుల్లో తనపై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. హార్థిక్ పాండ్యా వస్తే శ్రేయాస్ జట్టులో కొనసాగడం కష్టమే.
శ్రీలంక ఈ మ్యాచ్ ఓడితే సెమీస్ రేస్ నుంచి దాదాపు వైదొలగినట్లే. టోర్నీలో ఇంగ్లాండ్‌ను ఓడించడం మినహా శ్రీలంక పేలవ ప్రదర్శనే చేసింది. కెప్టెన్ శానకతో పాటు పతిరన, కుమార గాయాలతో దూరం కావడం కూడా ఆ జట్టును బలహీనపర్చింది. మిగతా ఆటగాళ్లలో నిలకడ లేక వరుసగా ఓటమి పాలవుతోంది. భారత్‌తో మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.