ఈ వరల్డ్ కప్‌లో(World Cup) షమీ(Shami) ఆటతీరును మెచ్చుకోనివారుండరు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను షమీ ఆటాడుకుంటున్నారు. అసాధారణ ప్రదర్శనతో అదరగొడుతూ భారత విజయాలలో కీలక పోషిస్తున్నాడు. టీమిండియాలో(Team India) ఇప్పుడు షమీ స్టార్ బౌలర్(Bowler). అయితే షమీ జీవితమంతా కష్టాలు, కన్నీళ్లతోనే గడిచిపోయింది. జీవితం నేర్పిన పాఠాల నుంచి రాటుదేలాడు. కష్టాల కడలి నుంచి బయటపడి, ఓర్పు, నేర్పుతో ఎదిగి పోరాడుతూ గెలుస్తున్నాడు. ఆత్మహత్య చేసుకుందామని ఒకానొక దశలో అనుకున్న షమీ, గోడకు కొట్టిన బంతిలా రయ్యిన దూసుకొచ్చాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని(Uttar Pradesh) అమ్రోహానీలో(Amrehani) 1990 సెప్టెంబర్‌ 3న ఓ రైతు కుటుంబంలో షమీ జన్మించాడు. తన తండ్రికి బౌలింగ్‌ చేయడమంటే ఇష్టం. ఆ రోజుల్లోనే భారత క్రికెట్‌ టీమ్‌లో అడుగుపెట్టాలనుకున్నాడు. కానీ ఆర్థిక కష్టాల వల్ల వ్యయసాయం బాటపట్టాడు. తన కలను తన కొడుకు ద్వారా నేరవేర్చుకోవాలని షమీ తండ్రి భావించాడు. కొడుకును బౌలింగ్‌ వైపు అడుగులు వేయించాడు. షమీ ప్రతిభను కోచ్‌ బద్రుద్దీన్‌(Badrudin) కూడా గుర్తించాడు. ఇతడు ఎప్పటికైనా గొప్ప బౌలర్‌ అవుతాడని గ్రహించాడు. షమీకి ట్రైనింగ్‌ ఇచ్చాడు. తన ట్రైనింగ్‌ పీరియడ్‌లో ఏ రోజూ షమీ లీవ్‌ తీసుకోలేదంటేనే అతని పట్టుదల ఏంటో మనకు తెలుస్తుంది. కొన్ని కారణాల వల్ల అండర్‌-19లో ఎంపిక చేయాలేదు. పాలిటిక్స్‌(Politics) వల్ల షమీ క్రికెట్‌ జీవితం బలి కాకూడదని.. కోల్‌కతా పంపించాలని తండ్రికి కోచ్‌ బద్రుద్దీన్‌ సూచించాడు. కోచ్‌ సూచనతో కోల్‌కతా వెళ్లిన షమీ అక్కడ అద్భుత ప్రదర్శనలు చేశాడు. బెంగాల్‌(Bengal) అండర్-22 జట్టుకు ఎంపిక కావడం జరిగింది. గంగూలీ(Ganguli) దృష్టిని ఆకర్షించాడు. షమీ బౌలింగ్‌, టాలెంట్‌ను గుర్తించిన గంగూలీ సెలెక్టర్లకు సిఫార్సు చేశాడు. రంజీ ట్రోఫికి జట్టులో చోటు దక్కించుకున్నాడు.

కానీ నిజజీవితంలో ఎన్నో ఒడిదుడుకులను షమీ ఎదుర్కొన్నాడు. ఆరేళ్ల క్రితం తనకు క్రికెట్‌ ఓనమాలు నేర్పించిన తండ్రిని కోల్పోయాడు. జీవితాంతం భాగస్వామిగా ఉంటుందనుకున్న భార్య తనను వదిలేసి వెళ్లిపోయింది. షమీకి భార్య విడాకులు ఇచ్చింది. అంతేకాకుండా గృహ హింస(Domestic Violence) జట్టు కింద షమీపై కేసులు పెట్టింది. తన కూతురు అనారోగ్యం బారిన పడింది. షమీకి కూడా ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌లకు పాల్పడ్డాడని ట్రోల్స్‌ చేశారు. అయినా ఎక్కడా షమీ వెనక్కి తగ్గలేదు. జీవితంలో ఎన్నో బంతులు తనను క్లీన్‌ బౌల్డ్‌ చేసినా.. గట్టిగా నిలబడ్డాడు. సంక్షోభాల నుంచి బయటపడి ప్రత్యర్థులను బౌల్డ్‌ చేస్తున్నాడు. ఇప్పుడు టీమిండియాలో స్టార్‌ బౌలర్‌గా మారాడు. తన భార్య వెళ్లిపోయాకే తనకున్న సకల దరిద్రాలు పోయాయని షమీ ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. టీమీండియాకు షమీ మరిన్ని సేవలు అందించాలని కోరుకుందాం.

Updated On 17 Nov 2023 6:24 AM GMT
Ehatv

Ehatv

Next Story