క్రికెట్(Cricket) అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్‌(One day Worldcup) అక్టోబర్‌ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది.డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌(England)-గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌(New Zealand) మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra modi Stadium) ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ ప్రపంచకప్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

క్రికెట్(Cricket) అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్‌(One day Worldcup) అక్టోబర్‌ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది.డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌(England)-గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌(New Zealand) మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra modi Stadium) ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ ప్రపంచకప్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన మొహమ్మద్‌ సిరాజ్‌(Mohammad Siraj) టీమిండియాకు(Team India) ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఆసియాకప్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో శ్రీలంక ఆటగాళ్లకు సిరాజ్‌ ముచ్చెమటమలు పట్టించిన సంగతి తెలిసిందే. ఇటీవలే అతను నంబర్‌ వన్‌ వన్డే బౌలర్‌గా అవతరించాడు. టీమిండియా తరఫున 21 టెస్ట్‌లు, 29 వన్డేలు8 టీ20లు ఆడిన సిరాజ్‌ మొత్తంగా 123 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి పెరిగిన తేజ(Teja) నిడమనూరు నెదర్లాండ్స్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 29 ఏళ్ల తేజ విజయవాడ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు వలస వెళ్లి, అక్కడే స్థిరపడ్డాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌ జట్టులో కీలక సభ్యుడు. నెదర్లాండ్స్‌ తరపున 20 వన్డే మ్యాచ్‌లు, ఆరు టీ-20 మ్యాచ్‌లు ఆడిన తేజ 531 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో తేజ ఓ చక్కటి సెంచరీని చేశాడు. నెదర్లాండ్స్‌ జట్టు వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కావడంలో తేజ కీలకపాత్ర వహించాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8వ తేదీన ఆస్ట్రేలియాతో ఆడుతుంది. అక్టోబర్‌ 14న పాకిస్తాన్‌తో తలపడుతుంది. నవంబర్‌ 19న ఫైనల్‌ పోరు జరుగుతుంది. ఈ ప్రపంచకప్‌ కోసం బంగ్లాదేశ్‌ తప్ప మిగతా అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి.

Updated On 26 Sep 2023 7:41 AM GMT
Ehatv

Ehatv

Next Story