అండర్-19 వరల్డ్‌కప్ (Under 19 World cup)పై టీమిండియా(Team India) గురిపెట్టింది. ఇప్పటికే ఆరోసారి వరల్డ్ కప్ గెలిచిన భారత్, మరోసారి కప్ గెలిచి సత్తా చాటాలని చూస్తోంది. భవిష్యత్‌లో స్టార్లు ఎదిగేందుకు క్రికెటర్లకు అండర్-19 వరల్డ్ కప్ తొలిమెట్టుగా భావిస్తారు.
అండర్-19 వరల్డ్‌కప్ (Under 19 World cup)పై టీమిండియా(Team India) గురిపెట్టింది. ఇప్పటికే ఆరోసారి వరల్డ్ కప్ గెలిచిన భారత్, మరోసారి కప్ గెలిచి సత్తా చాటాలని చూస్తోంది. భవిష్యత్‌లో స్టార్లు ఎదిగేందుకు క్రికెటర్లకు అండర్-19 వరల్డ్ కప్ తొలిమెట్టుగా భావిస్తారు. ఇప్పటికే ఐదు సార్లు 2000, 2008, 2018, 2022లో భారత్ ప్రపంచకప్‌లను కైవసం చేసుకుంది. ఆరోసారి టైటిల్ నెగ్గి రికార్డ్ సొంతం చేయాలని చూస్తోంది.
భారత జట్టు కెప్టెన్‌గా ఉదయ్ శరణ్(Uday Kiran) వ్యవహరిస్తున్నారు. శనివారంనాడు బంగ్లాదేశ్‌తో(Bangladesh) భారత్ తొలిపోరును ఎదుర్కోబోతుంది. శరణ్‌తో పాటు అర్షిన్ కులకర్ణి, ఆరవెల్లి అవనీష్, ముషీర్‌ఖాన్, రాజ్ లింబానీ మంచి ఫాంలో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. అండర్-19లో పాల్గొంటున్న 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో ప్రథమ మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో 12 జట్లను ఆరు, ఆరు జట్లను రెండు గ్రూపులుగా విడదీస్తారు. రెండు గ్రూపుల్లో టాప్-2 నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.
ఈ టోర్నీలో ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఫేవరెట్లుగా దిగుతున్నాయి.