స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఇంత పని చేస్తాడనుకోలేదు. అసలు ఇంత చెత్త రికార్డు తన పేరిట నమోదు చేసుకుంటాడని కూడా అనుకోలేదు. ఇంతకు ముందు జరిగిన మ్యాచ్‌లలో చిచ్చరపిడుగులా చెలరేగిన సూర్యకుమార్ ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన వన్డే సిరీస్(ODI Series)లో మాత్రం పేలవంగా ఆడాడు.

IND vs AUS 3rd ODI
స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఇంత పని చేస్తాడనుకోలేదు. అసలు ఇంత చెత్త రికార్డు తన పేరిట నమోదు చేసుకుంటాడని కూడా అనుకోలేదు. ఇంతకు ముందు జరిగిన మ్యాచ్‌లలో చిచ్చరపిడుగులా చెలరేగిన సూర్యకుమార్ ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన వన్డే సిరీస్(ODI Series)లో మాత్రం పేలవంగా ఆడాడు. మొదటి రెండు వన్డేలలో మొదటి బంతికే అవుటైన సూర్యకుమార్ యాదవ్.. మూడో వన్డేలోనూ ఫస్ట్‌బాల్‌కే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చెన్నై(Chennai)లోని చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అష్టన్ అగర్(Ashton Agar) బౌలింగ్‌లో ఫస్ట్‌బాల్‌కే అవుటయ్యాడు. అగర్ వేసిన స్టయిట్ లెంగ్త్ బాల్‌కు బ్యాక్‌ఫుట్‌పై షాట్ ఆడేందుకు సూర్య ప్రయత్నించాడు. అయితే బంతి మిస్ అయ్యింది. స్టంపులను తాకింది.. ఫస్ట్ బాల్‌కే అవుటైతే గోల్డన్ డక్ అంటారని తెలుసుగా.. ఈ మ్యాచ్‌లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగిన సూర్యకుమార్ పరమ చెత్త రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఓ వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచులలో గోల్డెన్ డక్(Golden Duck) సాధించిన తొలి బ్యాటర్(1st Indian batter)గా సూర్యకుమార్ నిలిచాడు. అదే విధంగా మూడు వన్డేల సిరీస్‌లో మూడుసార్లు డకౌట్ అయిన మొదటి భారత బ్యాట్స్‌మన్(1st Indian batter) కూడా సూర్యకుమార్ యాదవే! వన్డేలలో వరుసగా మూడుసార్లు డకౌట్ అయిన ఆరో ఇండియన్ బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. ఇంతకు ముందు సచిన్ తెందూల్కర్(Sachin Tendular), అనిల్ కుంబ్లే(Anil Kumble), జహీర్‌ఖాన్( Zaheer Khan), ఇషాంత్ శర్మ(Ishant Sharma), జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)లు ఇలా వరుసగా మూడు డకౌట్‌లు సాధించాడు. కాకపోతే వీరేమో ఫస్ట్ బాల్‌కు అవుటవ్వలేదు. ఇన్నీ చెప్పుకున్నాక అత్యధిక డకౌట్‌లు అయిన బ్యాట్స్‌మన్ గురించి కూడా చెప్పుకోవాలిగా.. ఈ రికార్డు శ్రీలంక ప్లేయర్(Sri Lanka Player) లసిత్ మలింగ(Lasith Malinga) పేరిట ఉంది. వన్డేల్లో మలింగ వరుసగా నాలుగు సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.
