ఐపీఎల్-2023లో 19వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జ‌ట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 23 పరుగుల తేడాతో కేకేఆర్‌పై విజయం సాధించింది.

ఐపీఎల్-2023లో 19వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జ‌ట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 23 పరుగుల తేడాతో కేకేఆర్‌పై విజయం సాధించింది. హైదరాబాద్ జట్టుకు ఇది వరుసగా రెండో విజయం. ఈ మ్యాచ్‌లో కెకెఆర్ కెప్టెన్ నితీష్ రాణా(Nitish Rana) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మొద‌ట‌ 229 పరుగులు చేసింది. న చేశారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. నారాయణ్ జగదీషన్ వికెట్‌పై నిలవడానికి ప్రయత్నించాడు. కానీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అతను 36 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ 10 పరుగులకే పెవిలియ‌న్ చేరాడు. అనంత‌రం కెప్టెన్ నితీష్ రాణా(Nitish Rana), రింకూ సింగ్(Rinku Singh) భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు క్రీజులో ఉండ‌గా కేకేఆర్ విజయం ఖాయమనిపించింది. కెప్టెన్ రాణా ఔట్ కావడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. రాణా 75 పరుగులు, రింకూ సింగ్ 58 పరుగులు చేశారు. సూపర్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆండ్రీ రస్సెల్ కేవలం 3 పరుగులు చేసి ఔటయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున భువనేశ్వర్ కుమార్ 1 వికెట్, మార్కో జాసన్ 2 వికెట్లు తీశారు. మయాంక్ మార్కండే కూడా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు(Sunrisers Hyderabad) శుభారంభం లభించలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) 9 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి(Rahul Tripati) 9 పరుగులు చేశాడు. అదే సమయంలో కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్(Aiden Markram) 50 పరుగులు చేశాడు. మార్క్రామ్.. హ్యారీ బ్రూక్‌(Harry Brook) తో కలిసి భారీ భాగస్వామ్యం నెకొల్పాడు. బ్రూక్ తుఫాను బ్యాటింగ్ చేస్తూ అందరి హృదయాలను గెలుచుకున్నాడు. కేవలం 55 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ(Abhishek Sharma) కూడా 32 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. హెన్రిచ్ క్లాసెన్ 16 పరుగులు చేశాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 229 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ లో ఆండ్రీ రస్సెల్ 2.1 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) 1 వికెట్ తీశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు జరగగా.. అందులో 15 మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ జట్టు విజయం సాధించింది. హైదరాబాద్ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.

Updated On 16 April 2023 5:16 AM GMT
Yagnik

Yagnik

Next Story