సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)కు ఇక నుంచి అంతా మంచే జరుగుతుందనిపిస్తోంది. అందుకు కారణం జట్టులోకి ముగ్గురు విధ్వంసక వీరులు వచ్చి చేరడమే! ఐపీఎల్-2013(ipl-2023) ఎడిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (sunrisers hyderabad)దారుణ పరాభవంతో ప్రారంభించింది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 72 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఏప్రిల్ ఏడున జరిగే తన తర్వాతి మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయెంట్స్‌తో ఆడుతుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)కు ఇక నుంచి అంతా మంచే జరుగుతుందనిపిస్తోంది. అందుకు కారణం జట్టులోకి ముగ్గురు విధ్వంసక వీరులు వచ్చి చేరడమే! ఐపీఎల్-2013(ipl-2023) ఎడిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (sunrisers hyderabad)దారుణ పరాభవంతో ప్రారంభించింది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 72 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఏప్రిల్ ఏడున జరిగే తన తర్వాతి మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయెంట్స్‌తో ఆడుతుంది. లక్నోలో జరిగే ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ జట్టు ముమ్మర కసరత్తు చేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్(aiden markram)తో పాటు హెన్రిచ్ క్లాసన్(henrich classen), మార్కో జానెసన్ (Marco Jansen)లు ఆరెంజ్ ఆర్మీ క్యాంప్‌లో కలిశారు. ఈ ముగ్గరు సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు రాజస్తాన్ రాయల్స్(rajasthan royals) తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎందుకు ఆడలేదంటే నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ ఉండింది కాబట్టి. ఈ ముగ్గరు ఆటగాళ్లు ప్రస్తుతం బ్రహ్మండమైన ఫామ్‌లో ఉన్నారు. నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మార్‌క్రమ్ అద్భుతంగా ఆడాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ త్రయం రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుపు బాటలో పయనిస్తుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. వీరితో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన మరో నలుగురు ఆటగాళ్లు కూడా ఐపీఎల్ కోసం భారత్‌కు చేరుకున్నారు. క్వింటన్ డికాక్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మిల్లర్ గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్నారు. పంజాబ్ కింగ్స్‌కు రబాడ ప్రాతినిధ్యం వహిస్తుంటే, నోర్జే ఢిల్లీ తరఫున ఆడుతున్నారు.