ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -2024(IPL) సీజన్‌లో బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. పరుగుల సునామీని సృష్టిస్తున్నారు. టోర్నీలో ఇప్పటి వరకు సగం మ్యాచ్‌లు అయిపోయాయి. 250కి పైగా పరుగులు ఇప్పటికే అయిదుసార్లు నమోదయ్యాయి. ఇందులో మూడుసార్లు సన్‌రైజర్స్‌(SRH) హైదరాబాద్‌ టీమ్‌ చేసినవే ఉన్నాయి. ప్యాట్‌ కమిన్స్‌(Pat Cummins) సారథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీమ్‌ బ్రహ్మండంగా ఆడేస్తోంది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -2024(IPL) సీజన్‌లో బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. పరుగుల సునామీని సృష్టిస్తున్నారు. టోర్నీలో ఇప్పటి వరకు సగం మ్యాచ్‌లు అయిపోయాయి. 250కి పైగా పరుగులు ఇప్పటికే అయిదుసార్లు నమోదయ్యాయి. ఇందులో మూడుసార్లు సన్‌రైజర్స్‌(SRH) హైదరాబాద్‌ టీమ్‌ చేసినవే ఉన్నాయి. ప్యాట్‌ కమిన్స్‌(Pat Cummins) సారథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీమ్‌ బ్రహ్మండంగా ఆడేస్తోంది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ(Abbhishek sharma), ట్రావిస్‌ హెడ్‌లతో(Travis head) పాటు హెన్రిచ్‌ క్లాసెన్‌, వైజాగ్‌ కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అబ్దుల్‌ సమద్‌ పరుగుల వరదను పారిస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరును సాధించిన జట్టుగా సన్‌రైజర్స్‌ రికార్డు సృష్టించింది. ఈ సీజన్‌లో 287, 266, 277, 287 స్కోర్లు చేసింది. కేకేఆర్‌ టీమ్‌ 272 పరుగులు చేయగా, ఆర్సీబీ(RCB) 263 పరుగులతో టాప్‌ ఫైవ్‌లో నిలిచాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్‌ సునిల్‌ గవాస్కర్‌(Sunil gawaskar) సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పలు తెప్పలుగా పరుగులు వస్తున్న తరుణంలో బౌండరీ లెంగ్త్‌ పెంచాలని బీసీసీఐని కోరాడు. క్రికెట్ బ్యాట్ విషయంలో తాను ఎలాంటి సలహాలు ఇవ్వలేనని, నిబంధనలకు అనుగుణంగానే పలు జాగ్రత్తలు తీసుకుని బ్యాట్లను తయారు చేస్తారని గవాస్కర్‌ తెలిపాడు. అయితే, తాను చాలా కాలంగా చెబుతున్నట్టుగా ప్రతీ గ్రౌండ్‌లో బౌండరీ సైజ్‌ పెంచాలన్నారు. అడ్వర్టైజ్‌మెంట్‌ బోర్డులను కాస్త వెనక్కి జరపాలని చెప్పాడు. 'అసలు క్యాచ్‌కు, సిక్సర్‌కు పెద్ద తేడా ఉండటం లేదు. ఎల్‌ఈడీని కూడా ఇంకాస్త వెనక్కినెట్టాలి. అలా అయితే, కనీసం 2-3 మీటర్ల మేర బౌండరీ లెంగ్త్‌ పెరుగుతుంది.లేదంటే బౌలర్లు ఎల్లప్పుడూ బాధితులుగానే మిగిలిపోవడం ఖాయం. టీ20 క్రికెట్‌లో గత కొన్ని రోజులుగా పెను మార్పులు వస్తున్నాయి. బ్యాటింగ్‌ కోచ్‌ నెట్స్‌లో ఇదే మీకు చివరి రౌండ్‌ అని చెప్పినట్టుగా.. ఆటగాళ్లు గ్రౌండ్‌లోకి రాగానే బ్యాట్‌కు పని చెబుతున్నారు. కొన్నాళ్లు ఇది బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత అంత ఉత్కంఠత కనిపించదు. ఆసక్తి సన్నగిల్లుతుంది. ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పడానికి ఓ పదునైన పదాన్ని వాడాలని ఉంది కానీ, ఇప్పుడు కాదు' అని గవాస్కర్‌ చెప్పాడు.

Updated On 23 April 2024 12:01 AM GMT
Ehatv

Ehatv

Next Story